బెంగాల్లో ఎన్నికలు అయిపోయాయి. కానీ అక్కడ అలజడి ఏ మాత్రం తగ్గడం లేదు. మొదట రాజకీయ హింస అన్నారు. తర్వాత మమతా బెనర్జీ ప్రధాని మోడీని అవమానించిందన్నారు. మధ్యలో గవర్నర్ ..తానే సీఎం అన్నట్లుగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ప్రారంభించారు. తాజాగా చీఫ్ సెక్రటరీని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా బదిలీ చేయడం.. వివాదాస్పదమయింది. ఆ చీఫ్ సెక్రటరీ కూడా కేంద్రం మాట వినడం కన్నా… తాను రిటైరైపోవడం మంచిదని డిసైడై.. ఆ పని చేసుకున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ దగ్గరే సలహాదారుగా చేరిపోయారు. ఈ వివాదంలో కేంద్రం… ఏదో గూడుపుఠాణి చేస్తోందన్న చర్చ దేశమంతా జరుగుతోంది.
తుపాను బెంగాల్‌ను అతలాకుతలం చేసింది. ప్రధాని మోడీ పరిశీలనకు వెళ్లారు. ఆయన మీటింగ్‌కు మమతా బెనర్జీ అరగంట ఆలస్యంగా వచ్చారన్న ఓ ప్రచారం ఉద్ధృతంగా సాగింది. కానీ.. అదంతా తప్పుడు ప్రచారం అని… మమతా బెనర్జీ ముందుగానే సమాచారం ఇచ్చారని.. వాదించారు. మమతా బెనర్జీ… బెంగాల్‌కు కావాల్సిన ఆర్థిక సాయం విషయంలో నివేదికను మోడీకి అందించి వెళ్లిపోయారు. దానికి కారణం… ముఖ్యమంత్రి.. ప్రధానమంత్రి మధ్య జరగాల్సిన అధికారిక సమావేశంలో ప్రతిపక్ష నేతలకే ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. దీంతో ఆమె తనను అవమానిస్తారని తెలుసుకుని డుమ్మాకొట్టేశారు. దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని బీజేపీ నేతలు .. సీఎస్‌ను ఉన్నపళంగా బదిలీ చేసేశారు.
సీఎస్ బందోపాధ్యాయ సర్వీస్‌ను మూడు నెలలకు పొడిగించిన కేంద్రం.. ఆయన బెంగాల్లో పని చేయాల్సిన పని లేదని.. కేంద్రం వద్దకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా అటు ప్రభుత్వం కానీ.. ఇటు బందోపాధ్యాయ కానీ అడగకుండా… కేంద్ర సర్వీసుల్లోకి ఆయనను రావాలని ఆదేశించడం… చట్ట విరుద్ధమని బెంగాల్ సర్కార్ వాదిస్తోంది. అయితే కేంద్రం పట్టు వీడలేదు. చివరికి బందోపాధ్యాయ రిటైర్ అయ్యారు. ఇప్పుడు తదుపరి చర్యలను తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. బందోపాధ్యాయపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. అలా తీసుకుంటే.. మమతా బెనర్జీ ఊరుకోదు. ఏదో ఒకటి చేస్తారు.
బెంగాల్లో కరోనా …తుఫాన్ విలయం కన్నా బీజేపీ రాజకీయమే ఆ రాష్ట్రానికి పెను ముప్పుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజల మధ్య ఇప్పటికే వర్గాల వారీ చిచ్చులు పెట్టేసి.. ఫలితం కోసం ఎదురు చూసింది.కానీ.. అనూహ్యఫలితం వచ్చే సరికి.. మమతా బెనర్జీ సర్కార్ ఉండకూడదన్నట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయినా సరే ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.