భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్న ఈటల రాజేందర్‌కు ఆ పార్టీ వ్యవహారశైలిపై నమ్మకం కుదరలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి కారణం.. కేసీఆర్ సర్కార్ పట్ల… కేంద్రం ఔదార్యం చూపిస్తూండటమే. బెంగాల్లో మమతా బెనర్జీ.. నిన్నగాక మొన్న గెలిచినా.. ముప్పుతిప్పలు పెడుతున్న కేంద్రం… కేసీఆర్‌ను మాత్రం ఎందుకు ఆప్యాయంగా చూస్తోందని ఆయన .. ఢిల్లీ పెద్దలను అడిగినట్లుగా చెబుతున్నారు. టీఆర్ఎస్తో విబేధించి.. కేసీఆర్ కు బద్ద శుత్రవులుగా మారిన తాము..తర్వాత … బీజేపీ వెళ్లి టీఆర్ఎస్తో సంబంధాలు పెట్టుకుంటే ఏం చేయాలని ఈటల ప్రధానంగా కేంద్ర పెద్దలను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
నిన్నటిదాకా ఈటల రాజేందర్ కేసీఆర్‌కు తమ్ముడు. కానీ ఇప్పుడు కాదు. ఈటల ఆర్థిక… రాజకీయ పునాదులన్నింటినీ కూకటివేళ్లతో సహా పెకిలించాలని… ఆయన కంకణం కట్టుకున్నారు. తనను తాను కాపాడుకోవాలనిఈటల ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో.. బీజేపీలో చేరితే.. తనను తాను కాపాడుకున్నట్లు అవుతుందా.. లేక టీఆర్ఎస్ – బీజేపీ వ్యూహంలో చిక్కబడిపోతానా అన్న సందేహంలో ఈటల ఉన్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయి క్లారిటీ కోసం.. ఆయన జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. తెలంగాణలో టీఆర్ఎస్తో ఎలాంటి సన్నిహిత సంబంధాలు ఉండవని.. దూకుడేనని… జేపీ నడ్డా ఈటలతో చెప్పారు కానీ.. మాటలు కాదని.. చేతల్లో చూపించాలని.. ఆయనను ఈటల కోరినట్లుగా చెబుతున్నారు.
ఈటల రాజేందర్ వెంటనే బీజేపీలో చేరబోవడం లేదు. కొంత సమయం తీసుకుంటారు. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తామని బీజేపీ మాటల్లో చెప్పడం కన్నా.. చేతల్లో చూపిస్తేనే.. తాను బీజేపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అంటే తెలంగాణ సర్కార్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించడమేనని చెబుతున్నారు. టీఆర్ఎస్ సర్కార్ అవినీతిపై .. ఇప్పటికే కేంద్రం వద్ద ఆధారాలు ఉన్నాయని .. వాటిపై చర్యలు ప్రారంభిస్తే.. తాను బీజేపీలో చేరేందుకు సిద్ధమని.. ఆయన ఓ రకమైన సందేశాన్ని… బీజేపీకి పంపినట్లుగా చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు టీఆర్ఎస్లోనూ కలకలం రేపుతోంది.