గుణశేఖర్ దృష్టి చారిత్రక, పౌరాణిక గాథలపై పడింది. ఆయన `రుద్రమదేవి` ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత `హిరణ్య కశ్యప` ప్రాజెక్టుని చేపట్టారు. అది అనివార్య కారణాల వల్ల మధ్యలో ఆగింది. ఈలోగా `శాకుంతలమ్` కథని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పుడాయన దృష్టి `ప్రతాపరుద్ర`పై పడింది. కాకతీయ వంశానికి చెందిన చివరి రాజు ప్రతాప రుద్రుడు. తను రుద్రమదేవి మనవడు. ఓరకంగా చెప్పాలంటే `రుద్రమదేవి`కి సీక్వెల్.. ఈ ప్రతాపరుద్రుడు. `రుద్రమదేవి` సమయంలోనే గుణశేఖర్‌కి ప్రతాపరుద్రుడి కథని తెరపైకి తీసుకురావాలన్న ఆలోచన కలిగింది. అయితే… రుద్రమదేవి ఎఫెక్ట్ తో దాన్ని పక్కన పెట్టారు. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో `ప్రతాపరుద్ర` స్క్రిప్టుపై గుణ బాగా కసరత్తు చేసినట్టు సమాచారం. అన్ని విధాలా సంతృప్తికరంగా స్క్రిప్టు రూపుదిద్దుకోవడంతో ఈ సినిమాని పట్టాలెక్కించాలన్న ఆలోచనకి వచ్చార్ట. `శాకుంతలమ్` తరవాత.. `హిరణ్యకశ్యప` మొదలవుతుంది. ఆ తరవాతే.. ప్రతాపరుద్రుడు సినిమా ఉంటుంది. ప్రతాపరుద్రుడిగా ఓ స్టార్ హీరో నటిస్తాడని సమాచారం.