అర్థశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్య్రమందామా? దానికి సలాము చేద్దామా? అని ప్రశ్నించాడు సిరివెన్నెల. `అర్థశతాబ్దం` సినిమాలోనూ ఓ ప్రశ్న దాగుంది. `ఈ యాభై ఏళ్ల స్వరాజ్యం ఎందుకు? ఎవరి కోసం` అనేదే ఆ ప్రశ్న. మరి సినిమాలోనైనా సమాధానం దొరికిందా, లేదా? ఈ సంగతి తెలియాలంటే `అర్థశతాబ్దం` చూడాలి. కార్తీక్‌రత్నం, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. ఈనెల 12న ఆహాలో విడుదల అవుతోంది. ట్రైలర్ ఈ రోజు బయటకు వచ్చింది.
పరువు హత్యల నేపథ్యంలో సాగే కథ అని.. ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. పుష్ష అనే అమ్మాయి కోసం కృష్ణ అనే అబ్బాయి పడే ఆవేదన. ఈ కథ. మధ్యలో వర్గ పోరాటాలు, అభ్యుదయ భావాలూ కలగలిపారు. ఓ పువ్వు కోసం రెండు వర్గాలు పోరాటం చేసుకోవడం ఈ కథలో ఆసక్తికరమైన పాయింట్. దాన్ని ఎలా ప్రజెంట్ చేశారో చూడాలి. సంభాషణలు భావోద్వేగంగా సాగాయి. ఓ సీరియస్ డ్రామాని తెరపై చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలగ జేశాయి. శుభలేఖ సుధాకర్, సాయి కుమార్ లాంటి సీనియర్ నటులకు కీలక పాత్రలు దక్కాయి. మరి.. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.