ఇటీవల ఓటీటీలలో విడుదలైన సినిమాల్లో.. జనాదరణ పొందిన చిత్రం `ఏక్ మినీ కథ`. బోల్డ్ కథే అయినా, యువతరానికి నచ్చేలా తీశారు. తన `సైజ్` చిన్నదన్న ఆత్మనూన్యతా భావం ఉన్న కుర్రాడిగా శోభన్ నటన.. సహజంగా అనిపించింది. ఇప్పుడు `పెళ్లి` సమస్యతో సతమతమయ్యే అబ్బాయిగా కనిపించబోతున్నాడు. `ప్రేమ్‌కుమార్` సినిమాలో. అభిషేక్ మహర్షి దర్శకుడు. రాశీ సింగ్ కథానాయిక. ఈ రోజు.. ఫస్ట్ లుక్‌నీ, టైటిల్ నీ విడుదల చేశారు. ఇందులో హీరో పాత్ర విచిత్రంగా ఉంటుందట. తనకు పెళ్లికావడం లేదన్న ఫస్ట్రేషన్‌తో… చేసిన చిత్రవిచిత్రాలు హాయిగా నవ్విస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికి 80 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. లాక్ డౌన్ తరవాత మిగిలిన షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తామని చిత్రబృందం చెబుతోంది. `ఏక్ మినీ కథ` రిజల్ట్ తో శోభన్ కి మంచి అవకాశాలే వస్తున్నాయి. అందులోనూ కొత్త తరహా కాన్సెప్టులు ఎంచుకుంటున్నాడు. మరో ఒకట్రెండు హిట్లు పడితే.. తాను నిలబడిపోయినట్టే.