వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓ పెద్ద రిలీఫ్ వచ్చి పడింది. పార్టీ పేరుపై ఇప్పటి వరకూ జరుగుతున్న ప్రచారం… వైఎస్ఆర్ ఆనే పేరును ఉపయోగించుకోనివ్వద్దంటూ.. అన్న వైఎస్ఆర్ పార్టీ పేరుతో కొంత మంది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయడం.. కొంత కాలం క్రితం వరకూ కలకలం రేపింది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు అ్న వైఎస్ఆర్ పార్టీ తరపున దాఖలైన పిటిషన్ను డిస్మిస్ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలన్న విజ్ఞప్తిని తోసి పుచ్చింది. ఈసీ నుంచి కూడా వివరాలు తెలుసుకున్న తర్వాత ఢిల్లీ హైకోర్టు పిటిషన్ను డిస్మిస్ చేసింది. వైఎస్ఆర్ అంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుకుంటారు.
కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వైఎస్ఆర్… అంటే.. యువజన శ్రామిక రైతు.. కానీ కడప జిల్లాకు చెందిన భాషా అనే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీదనే పార్టీని రిజిస్టర్ చేసుకున్నారు. ఆ పేరును తమకే ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలని … వైసీపీ నేతలు తన పార్టీ పేరును ఉపయోగించుకుంటున్నారని ఆయన ఈసీకీ ఫిర్యాదు చేశారు. తర్వాత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా… తమ పార్టీ లెటర్ హెడ్లపై.. వైఎస్ఆర్ అని కాకుండా.. యువజన రైతు కాంగ్రెస్ పార్టీ అని ముద్రించడం ప్రారంభించారు.
వైసీపీతో విబేధాలు వచ్చిన తరవాత రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఈ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. పార్టీ రద్దు అయిపోతుందని.. హెచ్చరికలు కూడా చేశారు. ఈ అంశం వైసీపీలో కొంత కలకలం రేపింది. చివరికి అన్నా వైఎస్ఆర్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టి వేయడంతో… వైసీపీకి ఊపిరి పీల్చుకునే పరిస్థఇతి వచ్చింది. ఇక వైఎస్ఆర్ పేరును వాడుకోవడానికి ఇబ్బంది ఉండదని నమ్ముతున్నారు.