జీన్స్‌లు, టీ షర్టులు వేసుకుని రావొద్దు. చింపిరి గడ్డాలు సినిమా స్టైల్ వేషాలతో అస్సలు రావొద్దు. చూడగానే రాముడు మంచి బాలుడు అన్నట్లుగా కనిపించాలి..ఈ ఆదేశాలు స్ట్రిక్ట్‌గా క్రమశిక్షణను పాటించే కాలేజీల్లో ఇచ్చినట్లుగా ఉన్నాయి కానీ… ఇవి ఇచ్చింది కొత్త సీబీఐ చీఫ్ సుభోద్ కుమార్ జైస్వాల్. సీబీఐలో పని చేసే సిబ్బంది ఎవరైనా ఇక స్ట్రిక్ట్‌గా డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని ఆయన ఆదేశాలు జారీ చేశారు. జీన్స్ , టీషర్ట్లు వద్దన్నారు. అలాగే గడ్డాలు పెంచకూడదన్నారు. మహిళా ఉద్యోగాలకూ డ్రెస్ కోడ్ నిర్ణయించారు. వారికీ జీన్స్, టీషర్ట్లను వేసుకుని ఆఫీసుకు రావొద్దని తేల్చేశారు.
సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లోనే కాదు… సీబీఐ సిబ్బంది.. కొత్త కొత్త ఫ్యాషన్లు అంటూ.. అలాగే డ్రెస్సెస్ వేసుకుని రావడం కామన్. ఢిల్లీ హెడ్ క్వార్టర్లో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల్లోనే పరిస్థితి గమనించిన ఆయన… కొత్త రూల్స్ అమల్లోకి తీసుకు వచ్చారు. సుభోద్ కుమార్ జైస్వాల్.. స్ట్రిక్ట్ ఆఫీసర్‌గా పేరు పొందారు. డీజీపీగా చేస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించిన రికార్డు ఆయనకు ఉంది. నిక్కచ్చిగా వ్యవహరిస్తారని పేరున్న ఆయన హయాంలో సీబీఐ … తనపై పడిన రాజకీయ ముద్రను వదిలించుకుంటుందని సాధారణ ప్రజలు కూడా ఆశిస్తున్నారు. ఈ సమయంలో… ఆయన సీబీఐలో నెలకొన్న అంతర్గత నిర్లక్ష్యాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతానికి సీబీఐకి సీరియస్ నెస్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న జైస్వాల్..అదే ఉత్సాహంతో.. సిన్సియర్‌గా వ్యవహరిస్తూ.. అక్రమార్కుల అంతు చూస్తే.. మళ్లీ సీబీఐపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. ఇప్పటి వరకూ అధికార పార్టీల టార్గెట్లు మాత్రమే.. చేధించిన సీబీఐ ఇకపై వారు..వీరు అనే తేడా లేకుండా… అక్రమార్కుల్ని వేటాడితే.. జైస్వాల్ పేరు మార్మోగడం ఖాయంగా చెప్పుకోవచ్చు.