టీకాల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్న ముఖ్యమంత్రులు.. తమకు తాము లేఖలు రాసుకుని ఓదార్చుకుంటున్నారు. కేరళ, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ సీఎంల లేఖల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. బెంగాల్ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ ఇదే అంశంపై లేఖలు రాసి.. ఎన్నికల తర్వాత అందరం కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. కానీ.. ఒక్కరూ స్పందించలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రులు వరుసగా ఒకరికొకరు లేఖలు రాసుకుంటున్నారు. దేశంలో ప్రస్తుతం టీకా విధానంపై రగడ సాగుతోంది. సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది.
అయితే .. ముఖ్యమంత్రులు మాత్రం స్పందించడం లేదు. కేంద్రం ఇవ్వకపోతే తాము గ్లోబల్ టెండర్లకు వెళ్తామని చెప్పుకొచ్చారు. గ్లోబల్ టెండర్లకు స్పందన రాకపోతే.. ఇతర రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. ఇలా ఒకరికొకరు లేఖలు రాసుకున్న వారిలో కేళ సీఎం పినరయి విజయన్, ఒడిషా సీఎం పట్నాయక్, ఏపీ సీఎం జగన్ ఉన్నారు. ఆ లేఖలు కేంద్రానికి మాత్రం పంపలేదు. అందుకే.. అడగాల్సిన వారిని అడగకుండా.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు ఎందుకు రాస్తున్నారని.. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నాయి.
రాష్ట్రాలను సంప్రదించకుండా… టీకా విధానాన్ని ఖరారు చేసింది ఎవరని.. టీకాలను గుప్పిట్లో పెట్టుకుందని ఎవరని ప్రశ్నలు వస్తున్నాయి. అసలు మోడీని అడిగితే కదా సమస్య పరిష్కారం అవుతుందని వీరి తీరుపై విపక్ష నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రులు అసలు అడగాల్సిన కేంద్రాన్ని అడగకుండా.. తమకు తాము కలసి పోరాడదాం రండి అంటూ.. పిలుచుకుంటున్నారు.