తెలుగునాట ఇంటిల్లిపాదినీ టీవీ సెట్ల ముందు కూర్చోబెట్టిన రియాలిటీ షో.. `బిగ్ బాస్`. నాగార్జున, ఎన్టీఆర్, నాని లాంటి స్టార్లు హ్యాండిల్ చేయడం వల్ల.. ఈ షోకి పాపులారిటీ వచ్చింది. బిగ్ బాస్ లో ఇప్పటి వరకూ 4 సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు 5వ సీజన్‌కి ముహూర్తం ఖరారైంది. నిజానికి మే చివరి వారంలోనే ఈ సీజన్‌ని పట్టాలెక్కించాలి. కానీ… కరోనా వల్ల ఆగిపోయింది.
ఇప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ జూన్‌లో ఈ సీజన్ మొదలెట్టాలని భావిస్తున్నార్ట. అందులో భాగంగా సెలబ్రెటీల లిస్టు ఒకటి తయారు చేసింది `మా`. ఇప్పుడు వాళ్లకు జూమ్ ద్వారా ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. `మా` టీమ్ రోజుకి ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూలు చేస్తోందట. మరో వారం రోజుల్లో.. ఓ ఫైనల్ లిస్టుని తయారు చేసే అవకాశం ఉంది. బిగ్ బాస్ హౌస్‌లో ప్రవేశ పెట్టే ముందు… కంటెస్టెంట్లు అందరినీ హోం క్వారెంటైన్ని పంపాల్సి ఉంటుంది.కాబట్టి… 15 రోజుల ముందుగానే ఈ ప్రోసెస్ ని మొదలు పెట్టాలి. ఈసారి ప్రైజ్ మనీ కూడా పెంచే అవకాశాలున్నట్టు టాక్.