టీకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర విధానాలను ప్రశ్నిస్తున్నాయి. కొన్ని నేరుగా ప్రశ్నించలేక అందరం ఒకేమాట మీద ఉందామంటూ … లేఖలు రాసుకుంటున్నారు. కానీ కొంత మంది అయితే.. తమ చేతలతోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ప్రభుత్వాల్లో బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కార్.. చత్తీస్‌ఘడ్‌లోని భూపేష్ బాఘెల్ సర్కార్ ముందు ఉన్నాయి. టీకా ధృవపత్రాలపై మోడీ ఫోటోను రెండు రాష్ట్రాలు తొలగించేశాయి. మమతా బెనర్జీ.. సర్కార్‌లోని వైద్య మంత్రి ఫోటోను ముద్రించాలని బెంగాల్ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే బెంగాల్.. కేంద్రం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.
అయినప్పటికీ మమతా బెనర్జీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 18-44 ఏళ్ల మధ్య వారికి టీకాలను రాష్ట్రాలు కొనుక్కోవాలని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో… ఇప్పటికే.. ప్రభుత్వాలన్నీ బడ్జెట్లు పెట్టుకుని కొనుగోలు ప్రారంభించి.. లభించినన్ని తమ ప్రజలకు వేస్తున్నాయి. ఇప్పటికే చత్తీస్‌ఘడ్‌లోని కాంగ్రెస్ సర్కార్ మోడీ ఫోటోను .. టీకా సర్టిఫికెట్లపై తొలగించేసింది. ఇప్పుడు బీజేపీ వివాదం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మొదట్లో టీకాలు కేంద్రమే రాష్ట్రాలకు పంపేది. దాని కోసం కేంద్రం .. బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది.
అప్పట్లోనే టీకాల పత్రాలపై మోడీ ఫోటో ముద్రిస్తున్నారని.. కరోనా మృతులకు ఇచ్చే డెత్ సర్టిఫికెట్లపైనా ఆయన ఫోటో ముద్రించాలన్న డిమాండ్ వినిపించింది.ఇప్పుడు.. ప్రభుత్వాలే.. నేరుగా సర్టిఫికెట్లపై మోడీ ఫోటోను తీసేస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ ఈ విషయంలోఎలాంటి విమర్శలు చేయలేదు కానీ… ఇతర అంశాల్లో మాత్రం.. తన కోపాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. అయితే.. కేంద్రంతో ఢీ అంటే.. ఢీ అనేదానికి సిద్ధమవుతున్న ప్రభుత్వాలు.. ఈ విషయంలో వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదు.