ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో ఆర్మీ ఆస్పత్రిలో కుట్ర జరిగిందనేదానిపై రక్షణ మంత్రిత్వ శాఖ అంతర్గతంగా విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి, రక్షణ శాఖ ఉద్యోగి.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో టీటీడీ జేఈవోగా పని చేస్తున్న ధర్మారెడ్డి, అప్పటి గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి కలిసి కుట్ర పూరితంగా డిశ్చార్జ్ చేసి..మళ్లీ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారని.. ఆధారాలతో సహా రఘురామకృష్ణరాజు.. రక్షణ మంత్రి అయిన రాజ్‌నాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్మీ వ్యవహారాలను మ్యానిపులేట్ చేయడం సాధ్యం కాదు. ఎంపీ అందించిన ఫిర్యాదును.. రక్షణ మంత్రి.. సంబంధిత విభాగానికి పంపారు. వారు వెంటనే అంతర్గత విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
ఈ కారణంగానే గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిని ప్రభుత్వం వ్యూహాత్మకంగా రాత్రికి రాత్రే బదిలీ చేసింది. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా నిలుపుదల చేసింది. ఇప్పుడు.. డిప్యూటేషన్‌పై ఉన్న రక్షణ శాఖ ఉద్యోగి ధర్మారెడ్డిని కూడా వెనక్కి పిలవాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రక్షణ శాఖలో అకౌంట్స్ విభాగంలో ధర్మారెడ్డి ఉద్యోగి. ఏపీ సర్కార్ పెద్దల ప్రాపకం ఉండటంతో టీటీడీ జేఈవోగా వచ్చారు. ఈవో పదవిని ఐఏఎస్ అధికారులకే ఇవ్వాల్సి ఉండటంతో ఆయనను జేఈవోగా నియమించి.. ఆయన ద్వారానే పాలన సాగేలా చూస్తూ ఉంటారు.
ఇప్పుడు.. రక్షణ శాఖలోని తన పరిచయాలతో.. రఘురామకృృష్ణరాజు మీద కుట్ర చేసినట్లుగా ఆరోపణలు రావడంతో… ఇక ఏపీలో ఉంచకుండా.. వెనక్కి పిలిపించాలని రక్షణ శాఖ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్.. తన ఢిల్లీ పర్యటనలో ప్రత్యేకంగా రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్మెంట్ కోరారని.. ధర్మారెడ్డి రీకాల్‌ను ఆనిలిపివేయాలని ఆయన కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి రఘురామకృష్మరాజు పోరాటంలో వికెట్లు పడటం ప్రారంభమైందన్న చర్చ మాత్రం అధికారవర్గాల్లో జరుగుతోంది.