కరోనా కాలంలో ఆపద్భాంధవుడి పాత్ర పోషించాడు సోనూసూద్. అడిగినవాళ్లకూ, అడగని వాళ్లకూ నేనున్నా అంటూ సాయం చేశాడు. ఓ రకంగా మిగిలిన వాళ్లకూ స్ఫూర్తి నింపాడు. చాలామంది సెలబ్రెటీలు ఇప్పుడు తమ వంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి ఆక్సిజన్ అందించే బాధ్యతని తన భుజాన వేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలలోనూ ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి, ఆక్సిజన్ కొరతని కొంత వరకూ తీర్చాడు. దాంతో చిరు మంచి మనసుకి సోషల్ మీడియా జై కొడుతోంది. సోనూసూద్ సైతం.. చిరుని పొగడ్తలతో ముంచెత్తాడు.
చిరు, చరణ్‌లు ముందుకొచ్చి… ఆక్సిజన్ బ్యాంకుల్ని ఏర్పాటు చేయడం స్ఫూర్తినిచ్చే విషయమని, మిగిలిన సెలబ్రెటీలూ తమ వంతు సాయం చేయడం ఆనందంగా ఉందని ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సోసూ. సినీ తారలు ఇలా ముందుకొచ్చి, సామాజిక సేవలో పాలు పంచుకోవడం వల్ల, ప్రజలకు ఓ భరోసా, నమ్మకం, భద్రత కలుగుతాయని.. మిగిలిన వాళ్లలోనూ స్ఫూర్తి నింపుతుందని, ప్రతీ పనినీ ప్రభుత్వాలే చేయాల్సిన అవసరం లేదని, చేయగలిని స్థోమత ఉన్న ప్రతి ఒక్కరూ.. నడుం బిగించాలని విజ్ఞతి చేశాడు.