ఉప్పెనతో ఒక్కసారి… టాలీవుడ్ పై విరుచుకుపడ్డాడు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడైనా, తొలి సినిమాతో తనదైన ముద్ర వేశాడు. ఆసినిమా ఏకంగా 50 కోట్ల మైలు రాయిని అందుకుంది. దాంతో బుచ్చికి ఆఫర్లు వెల్లువెత్తాయి. రెండో సినిమా కూడా మైత్రీతో ఫిక్సయ్యింది. ఎన్టీఆర్ ని హీరో అనుకున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ కోసం ఓ కథ అల్లుకున్నాడు బుచ్చి. అలా… ఎన్టీఆర్ – బుచ్చి కాంబోని మైత్రీ ఫిక్స్ చేసింది.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తో బుచ్చి మంతనాలు ప్రారంభించినట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా కథా పరమైన చర్చలు నడుస్తున్నాయని సమాచారం. ఈ కాంబోని కూడా మైత్రీ మూవీస్‌నే తెరపైకి తీసుకొచ్చిందని తెలుస్తోంది. అంటే.. ఎన్టీఆర్ స్థానంలో అల్లు అర్జున్ వచ్చి చేరాడా? లేదంటే… బన్నీ కోసం బుచ్చి ఓ కథ రెడీ చేశాడా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. బుచ్చితో సినిమా చేయడానికి ఎన్టీఆర్ సిద్ధంగానే ఉన్నా, సమీకరణాలు అంత ఈజీగా లేవు. ఎందుకంటే… ఆర్.ఆర్.ఆర్ అయిన వెంటనే, కొరటాల శివతో సినిమా చేయాలి. ఆ తరవాత ప్రశాంత్ నీల్ సైతం సిద్ధంగా ఉన్నాడు. బుచ్చిబాబు కోటా వచ్చేసరికి చాలాకాలం పట్టేట్టు ఉంది. అందుకే.. ఎందుకైనా మంచిదని.. బన్నీకి టచ్‌లో వెళ్లాడా? అనేది తెలియాల్సిన విషయాలు. బన్నీ కూడా ఇప్పుడు కొత్త కథల వేటలో ఉన్నాడు. కొరటాల శివతో సినిమా వెనక్కి వెళ్లడంతో.. ఆ ప్లేస్‌లో ఓ సినిమాని పట్టాలెక్కించాలి. బోయపాటి శ్రీను, వేణు శ్రీరామ్ లలో ఒకరి కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో బుచ్చి పేరు కూడా చేర్చొచ్చు.