విజయశాంతి ప్రస్తుతం బిజెపి పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. మోడీ ప్రభుత్వం దేశమంతటికీ ఉచిత వ్యాక్సినేషన్ వేయించడానికి తీసుకున్న నిర్ణయంపై ఒకవైపు హర్షం వ్యక్తం అవుతున్నప్పటికీ ఈ నిర్ణయం చాలా ఆలస్యంగా తీసుకున్నారని ముందుగా జాగ్రత్తపడి ఉంటే అనేక ప్రాణాలు నిలబెట్ట కలిగి ఉండేవారని విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే సామాన్యుల మాట అటుంచి విపక్షాలు మాత్రం మోడీ తీసుకున్న నిర్ణయం పై రకరకాలుగా విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోడీ పై మాటల తూటాలతో విరుచుకుపడే ఓవైసీ కూడా బీజేపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఆ విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి విజయశాంతి సోషల్ మీడియా వేదికగా ప్రయత్నించారు.
విజయశాంతి ట్వీట్ చేస్తూ, ” కోవిడ్ వ్యాక్సిన్ కొరత 135 కోట్ల పైన జనాభా ఉన్నప్పుడు సహజం ఒవైసీ జీ. ప్రపంచం మొత్తం కూడా చాలావరకు ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి . 2020 జూలై లో ఎక్కడ ఆమోదించబడ్డ వ్యాక్సిన్ కు, ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఉండాలి..? ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ ట్విన్ పార్టీ TRS అధినేత కేసీఆర్ గార్కి చెప్పలేదా..? 25 శాతం ప్రైవేటు హాస్పిటల్స్ కి ఇవ్వటం VIP కల్చర్ అయితే, TRS రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ కొనుగోలు ఇవ్వాలని అడుగుతున్నది బ్లాక్ మార్కెట్ కల్చర్ కోసమా.? ఒవైసీ గారు” అని రాసుకొచ్చారు.
కోవిడ్ వ్యాక్సిన్ కొరత 135 కోట్ల పైన జనాభా ఉన్నప్పుడు సహజం ఒవైసీ జీ
ప్రపంచం మొత్తం కూడా చాలావరకు ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి
2020 జూలై లో ఎక్కడ ఆమోదించబడ్డ వ్యాక్సిన్ కు, ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఉండాలి..?
— VIJAYASHANTHI (@vijayashanthi_m) June 8, 2021
అయితే విజయశాంతి ట్వీట్ కి నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఇంగ్లాండ్, కెనడా వంటి దేశాలు ఎంతో జాగ్రత్త పడి తమ జనాభాకు సరిపడా దానికంటే ఎక్కువ వ్యాక్సిన్లు ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకుంటే, మోడీ ప్రభుత్వం కనీసం 10 శాతం మందికి సరిపడా వ్యాక్సిన్లు కూడా ఆర్డర్ ఇవ్వలేదని, అలా ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని నెటిజన్లు విమర్శించారు. ఇంకొందరు మాత్రం, పదేపదే పార్టీలు మారే విజయశాంతి అసలు ఇప్పుడు ఏ పార్టీలో ఉందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా వ్యాక్సిన్ ల విషయం లో కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించింది అన్న మాట వాస్తవం. అయితే ఆ తప్పును సరి దిద్దుకునేలా దేశమంతటికీ ఉచిత వ్యాక్సినేషన్ చేయించడానికి తీసుకున్న నిర్ణయం అభినందనీయం. వీటి మధ్యలో అటు ఓవైసీ వ్యాఖ్యలు, ఇటు విజయ శాంతి కౌంటర్లు రాజకీయ ఉనికి కోసం పడే తాపత్రయం.