ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. సునీల్ కుమార్ క్రిస్టియన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రిస్టియానిజాన్ని భారత్‌కు అందించిన బ్రిటిష్ వారిని వేనోళ్ల పొగుడుతూ… క్రిస్తును ఎంతో స్తుతిస్తూ.. ఆయన చెప్పిన నీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్‌గానే ఉన్నాయి. అయితే.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆయన ఎస్సీ రిజర్వుడు సర్టిఫికెట్తో ఇప్పటి వరకూ అవకాశాలు పొందుతూ వచ్చారు. ఈ విషయాన్ని గుర్తించిన లీగల్ రైట్స్ అడ్వైజరీకన్వీనర్ ఎన్ఐ జోషి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.
ఎస్సీ మాల పేరుతో రిజర్వేషన్ పొంది… క్రిస్టియన్‌గా మతం మార్చుకున్న సునీల్‌కుమార్ అన్ని రకాల రిజర్వేషన్లను అనుభవిస్తున్నారని.. ఆయనను తక్షణం సర్వీస్ నుంచి తప్పించాలని కోరారు. మతం మార్చుకున్న వారు రిజర్వేషన్‌ను వదలుకోవాలన్న… మద్రాస్ హైకోర్టు తీర్పు మేరకు చర్యలు తీసుకోవాలని జోషి.. కేంద్ర హోంశాఖను కోరారు. అలాగే సునీల్ కుమార్ సర్వీస్ నిబంధనలు కూడా ఉల్లంఘించారని..అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో సంస్థను కూడా నిర్వహిస్తున్నారని… తన ఫిర్యాదులో జోషి పేర్కొన్నారు. అంబేద్కర్ మిషన్ పేరుతో హిందూ వ్యతిరేక భావాలను సునీల్ ప్రోత్సహించారని, సునీల్‌కుమార్‌పై సెక్షన్ 153(ఏ), 295(ఏ) కింద ఎఫ్ఐఆర్ సమోదు చేయాలని కోరారు.
తాను ఫిర్యాదు చేసిన అంశాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని జోషి కోరుతున్నారు. నిజానికి ఏపీలో … ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల నుంచి గెలిచిన అత్యధిక మంది ప్రజాప్రతినిధులు… ముఖ్యంగా వైసీపీ తరపున గెలిచిన వారు… మతం మారిన వారే. హోంమంత్రి సుచరిత… తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వంటి వారిపై నేరుగా రాష్ట్రపతికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఆయన విచారించమని కూడా ఆదేశించారు. అయితే ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వారు కావడంతో.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మతం మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవని ఎప్పటి నుంచో నిబంధన ఉంది. కానీ.. ఎవరూ పట్టించుకోడం లేదు. ఇప్పుడు సునీల్ కుమార్ పై చేసిన ఫిర్యాదునైనా కేంద్రం పట్టించుకుంటుందో లేదో చూడాలి..!