కూరగాయల మార్కెట్‌కు వెళ్తే ఏం చేస్తాం… ఎక్కడ రేట్లు తక్కువ ఉంటే అక్కడ కొనుగోలు చేస్తాం..!ఒక్క కూరగాయలే కాదు.. ఏ వస్తువైనా.. తక్కువకు ఇచ్చే వారి దగ్గరే కొనుగోలు చేస్తాం. పట్టుబట్టి మరీ ఎక్కువ ధర ఇచ్చే దగ్గర కొంటే… అది వారి సొమ్ము కాదని అర్థం. అచ్చంగా ఏపీ సర్కార్ ఇప్పుడు.. ప్రజల సొమ్మును.. తమ సొమ్ము కాదుగా అని అడ్డంగా దుబారా చేస్తోంది. అందులో తెర వెనుక గూడుపుఠాణీలో ఉన్నాయో లేవో కానీ.. బహిరంగంగా అయితే.. ఒక్క నెల కరెంట్ కొనుగోళ్లలో రూ. 48 కోట్ల ప్రజాధనానికి టెండర్ పెట్టేసింది.
ఒక్క నెలలో రూ. 48 కోట్ల అధికార చెల్లింపులు..!
ఏపీలో విద్యుత్ వ్యవహారాలను పరిశీలించడానికి ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఉంది. విద్యుత్ సంస్థల్లో అవకతవకలను గుర్తిస్తూ ఉంటుంది. ఈ సగత ేడాది డిసెంబర్ – జనవరి మధ్య నెల రోజుల్లో డిస్కంలో బహిరంగ మార్కెట్లో కొన్న కరెంట్ వ్యవహారాలను బయట పెట్టింది. ఆ వివారాలు మైండ్ బ్లాకయ్యేలా ఉన్నాయి. తక్కువ ధరకు అందుబాటులో ఉన్న కరెంట్‌ను కొనుగోలు చేయకుండా.. ఎక్కువ ధర పెట్టి బహిరంగ మర్కెట్లో కరెంట్ కొనుగోలు చేశారు. రోజుకు రూ. కోటిన్నర చొప్పున అధికంగా చెల్లించారు. ఒక్క నెలలో ఇలా చెల్లించిన మొత్తం రూ. 48 కోట్లు.
తక్కువ ధరకు అందుబాటులో ఉన్నా ఎక్కువ ధరకు కరెంట్ కొనుగోలు..!
ప్రభుత్వానికి తక్కువ ధరకు అందుబాటులో ఉన్న విద్యుత్. .. ఏవో చిన్నా చితక సంస్థలు ఆఫర్ చేసినవి కావు. ప్రభుత్వమే.. పీపీఏలు కుదుర్చుకున్న సంస్థలు తక్కువ ధరకు అందుబాటులో ఉంచిన విద్యుత్‌ను కొనుగోలు చేయలేదు. ఏపీఈఆర్సీ.. ఎంత ధఱ పెట్టారు.. ఎంత పీపీఏలు కుదుర్చుకున్న సంస్థలు కరెంట్ అందుబాటులో ఉంచాయి.. ఈ వివరాలన్నింటినీ చాలా స్పష్టంగా తన నివేదికలో వెల్లడించింది. ఈ వ్యవహారం ఇప్పుడు విద్యుత్ శాఖలో సంచలనంగా మారింది.
ఎవరి దగ్గర కొన్నారో చూస్తే క్విడ్ ప్రో కో తేలిపోతుందా..?
ప్రస్తుతం ఏపీ ఈఆర్సీ వెల్లడించిన స్కాం.. ఒక్క నెలలో జరిగింది. మొత్తంగా ఏడాది మొత్తం వ్యవహారాలను బయటకు తీస్తే.. కొన్ని వందల కోట్ల స్కాం బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీఈఆర్సీ.. ఈ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసోంది. నెల రోజుల స్కాంకు సంబంధించిన.. వివరాలను పంపి… అలా రూ. 48 కోట్లు నష్టం చేయడానికి నెలాఖరులోగా సమాధానమివ్వాలని డిస్కంలను ఆదేశించింది. ముందు ముందు ఈ వ్యవహారాంలో పెద్ద పెద్ద తలకాయలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఎక్కువ ధరలకు కొనుగోలు చేసిన కరెంట్ ఎవరి దగ్గర కొన్నారో ఆరా తీస్తే మొత్తం తెలిసిపోతుందని విపక్షాలు అంటున్నాయి.