ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మగలిగిన ఆస్తులు ఆమ్మేస్తోంది. అమ్మలేనివి తాకట్టు పెడుతోంది. ముఖ్యంగా అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో కలెక్టరేట్లను కూడా వదిలి పెట్టడం లేదు. విశాఖపై ప్రధానంగా ఏపీ సర్కార్ కన్ను ఉంది. ఇప్పటికే అక్కడ ఆస్తులు పెద్ద ఎత్తున అమ్మడానికి నోటిఫికేషన్లు ఇచ్చి రెడీగా ఉన్న ప్రభుత్వం తాజాగా.. కలెక్టరేట్ సహా…, పలు రకాల ప్రభుత్వ కార్యాలయాలను… తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇటీవల అప్పుల కోసం ఏపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. గత ఏడాది మద్యంపై ఆదాయం అంతా ఈ సంస్థకు మళ్లించి.. రూ. ఇరవై వేల కోట్లకుపైగా అప్పు తెచ్చారు. అవి అయిపోయాయి.
ఇప్పుడు ఆ కార్పొరేషన్ నుంచి ఇంకా రుణాలు తీసుకోవాలంటే… ఆ సంస్థకు ఆస్తులు ఉండాలి. దీంతో.. ఆస్తులను ఆ సంస్థకు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం..ఖరీదైన ఆస్తులను ఎంపిక చేశారు. మొత్తం పదిహేను రకాల ఆస్తులను ఎంపిక చేశారు. వాటిలో దాదాపుగా మూడెకరాల్లో ఉన్న విశాఖ కలెక్టరేట్ నుంచి పాటు బక్కన్నపాలెంలోని వికలాంగుల శిక్షణా కేంద్రం వరకూ.. చాలా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. విశేష ఏమింటే.. ప్రభుత్వ ఐటీఐ కాలేజీ. ఎకార్డ్ యూనివర్శిటీ కూడా.. తాకట్టు పెట్టే ఆస్తుల జాబితాలో ఉన్నాయి. వీటిని తాకట్టు రూ. పదహారు వందల కోట్లను అప్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వం తీరు చూసి… విశాఖ ప్రజలు ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎక్కడైనా సంపదను సృష్టించి.. ఆ సంపదను అమ్మి ప్రజల ఆస్తుల విలువ పెంచుతుంది కానీ.. ఈ ప్రభుత్వం ఎప్పుడో నలభై యాభై ఏళ్ల కిందటి ప్రభుత్వాలు సమకూర్చి పెట్టిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా తాకట్టు పెట్టుకోవడం.. అమ్ముకోవడం వంటివి చేయడం ఏమిటన్న చర్చ నడుస్తోంది. ఏమైనా అంటే కేసులు పెడతారేమోనన్న భయంతో చాలా మంది నోరు తెరవడం లేదు కానీ… విశాఖ వాసుల్లో మాత్రం.. అసంతృప్తి గూడుకట్టుకుపోతోంది.