నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ రోజు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా… ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. బాలయ్య నటించే 107వ సినిమా ఇది. యదార్థ సంఘటనల నేపథ్యంలో కథ సాగబోతోందని, బాలయ్య వేట త్వరలోనే మొదలు కాబోతోందని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి తమన్ ని సంగీత దర్శకుడిగా ఎంచుకుంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం `అఖండ`తో బిజీగా ఉన్నారు బాలయ్య. ఆ వెంటనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇటీవల `క్రాక్`తో సూపర్ హిట్ కొట్టారు గోపీచంద్ మలినేని. ఈసారి కూడా మంచి మాస్ మసాలా కథని తయారు చేస్తున్నారు. స్క్రిప్టు పనులు దాదానపుగా పూర్తయ్యాయి. సినిమా కోసం ప్రస్తుతం కథానాయికల ఎంపిక కోసం కసరత్తులు జరుగుతున్నాయి. శ్రుతిహాసన్, త్రిష లాంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.