కొన్నాళ్ల క్రితం చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతు తన ఇద్దరు పిల్లలను కాడెడ్లుగా మార్చుకుని వ్యవసాయం చేస్తూంటే… జాలి పడిన సోనుసూద్ ట్రాక్టర్ పంపించారు. ఆ విషయం అప్పుడు సంచలనాత్మకం అయింది. సోను సూద్ దాతృత్వాన్ని అందరూ అభినందించారు. కారణం ఏమిటో తెలియదు కానీ.. ఒక్క వైసీపీ మాత్రం… ఆయన రైతు కాదని… మరొకటని.. ారు అలా కాడెడ్లతో వ్యవసాయం చేయడం లేదని నమ్మించడానికి చాలా ప్రయత్నం చేశారు. రైతుపై ఆరోపణలు చేశారు. అప్పుడే వైసీపీకి టార్గెట్ అయిన సోనుసూద్.. ఇప్పుడు.. మరోసారి వైసీపీకి టార్గెట్ అవుతున్నారు. చంద్రబాబుతో కలిసి కరోనా పరిస్థితుల్లో… సమాజ సేవ అంశంపై… వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని.. తన ఆలోచనలు పంచుకోవడంతో పాటు.. చంద్రబాబును పొగడటమే దీనికి కారణం.
సోనుసూద్ తో కలిసి పని చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకొచ్చారు. సోనుసూద్ చేస్తున్న సేవ గొప్పదన్నారు. చంద్రబాబు పొగిడినందున.. సోనుసూద్ కూడా చంద్రబాబు గురించి రెండు మంచి మాటలు చెప్పారు. ఆ మంచి మాటలను టీడీపీ సోషల్ మీడియా విభాగం విపరీతంగా వైరల్ చేసింది. ఇది వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఎలా నచ్చుతుంది. వెంటనే సోనుసూద్‌పై రివర్స్ ఎటాక్ ప్రారంభించారు. ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభించారు. చివరికి…ఆయనకు ఓ సామాజికవర్గం ముద్ర కూడా తగిలించేశారు.
మొదటి నుంచి సోనుసూద్‌పై ప్రశంసలే కాదు.. ఆయనకు వస్తున్న పేరును బట్టి రాజకీయ విమర్శలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. మొదట్లో శివసేన ఆయనను టార్గెట్ చేసింది. ఆయనకు డబ్బులెక్కడి నుండి వస్తున్నాయని ప్రశ్నించింది. కొంచెం ఘాటువిమర్శలే చేసింది. ఆయనను బీజేపీతో ముడి పెట్టింది. చివరికిఆయన ముఖ్యమంత్రి ఉద్దవ్ ధాకరేని కలిసి.. తన సేవలో రాజకీయ ఉద్దేశం లేదని వివరణ ఇచ్చుకున్న తర్వాత .. శివసేన సైలెంటయింది. ఆ తర్వాత పెద్దగారాజ కీయ పార్టీలు విమర్శలు చేయడం లేదు. ఇప్పుడు… మళ్లీ వైసీపీ .. ఆ విమర్శలు ప్రారంభించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో సోనుసూద్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. అధికారులు అడిగినా.. సాయం చేస్తున్నారు. ఆక్సిజన్ ప్లాంట్లు వంటివి ఏర్పాటు చేస్తున్నారు.