విశాఖలో ఈ వారాంతం కూడా.. కూల్చివేతలు చోటు చేసుకున్నాయి. ఎప్పట్లానే… టీడీపీ నేతలనే టార్గెట్ చేశారు. కొంత కాలంగా.. ఒక్క పల్లా శ్రీనివాసరావునే టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆయననే మరోసారి టార్గెట్ చేశారు. ఆయన కుటుంబానికి చెందిన భూముల్లో … తెల్లవారు జామునే పోలీసులతో విరుచుకుపడి.. ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టేసి.. అందులో ఉన్న వాటిని కూల్చేశారు. సహజంగానే దీనిపై రాజకీయ దుమారం రేగింది. ఈ వారాంతపు కూల్చివేతలు ఏమిటని..ప్రశ్నించారు. నిజానికి అది ప్రభుత్వ స్థలమే అయితే.. అధికారికంగా.. నోటీసులు ఇచ్చి.. వర్కింగ్ డేస్లో.. పట్ట పగలు వచ్చి కూల్చివేయాలని.. సవాల్ చేస్తున్నారు.
కేవలం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టి… న్యాయస్థానాలకు కూడా వెళ్లే చాన్స్ లేకుండా… కూల్చివేతలు చేయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. పల్లా కుటుంబానికి.. యదవ జగ్గరాజు పేట చెరువుకు దగ్గర భూమి ఉంది. వారి భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు. అది ప్రభుత్వ భూమి అంటూ.. ఆరోపిస్తూ.. కూల్చివేతలకు తెల్లవారుజామునే అధికారులు వచ్చారు. అయితే.. ఆ స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను తీసుకుని వచ్చిన పల్లా కుటుంబీకులు.. జాయింట్ సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలం ఉంటే తీసుకోవాలని సూచించారు. కానీ అదే పట్టించుకోలేదు,. కూల్చివేతే లక్ష్యం అన్నట్లుగా కూల్చివేసిన తర్వాత వెనుదిగిరారు.
కూల్చివేతల తర్వాత మంత్రి అవంతి ప్రెస్ మీట్ పెట్టి.. ఏ పార్టీ వారు ఆక్రమణలకు పాల్పడిన కూల్చేస్తామని భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. అది ప్రభుత్వ భూమి కాకపోతే.. అవంతి రాజకీయాల నుంచి తప్పుకుంటారా.. అని టీడీపీ సవాల్ చేసింది. మొత్తానికి ప్రభుత్వమే ప్రైవేటు ల్యాండ్ని వివాదాల్లోకి నెడుతోందన్న విమర్ిశలు వ్యక్తమవుతున్నాయి. పల్లా శ్రీనివాసరావును ఏకపక్షంగా టార్గెట్ చేసి.. ఆయన ఆస్తులపై విపరీతంగా దాడులకు తెగబడుతున్నారు. గతంలో ఓ భవనాన్ని కూల్చేశారు. ఇప్పుడు భూమిని వివాదంలోకి తెచ్చారు. అంతా విజయసాయిరెడ్డి చేయిస్తున్నారని.. ఆయన విశాఖను చీడలా పట్టారని టీడీపీ నేతలు మండి పడుతున్నారు.