లాక్ డౌన్ తో షూటింగులు బంద్ అయ్యాయి. హీరోలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కొంతమంది కొత్త కథలు వింటూ కాలక్షేపం చేస్తే, ఇంకొంతమంది కొత్త లుక్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో శౌర్య ఒకడు. గత కొన్ని నెలలుగా.. జిమ్ లో చమట చిందిస్తున్నాడు శౌర్య. తన లుక్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కండలు తిరిగిన దేహంతో.. ఆకట్టుకుంటున్నాడు శౌర్య. తన వర్కవుట్లకు సంబంధించిన స్టిల్స్ ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నాడు. ఆమధ్య పూర్తి గడ్డంతో ఓ లుక్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు మరో లుక్ బయటకు వచ్చింది. రెండింట్లోనూ… శౌర్య జిమ్ బాడీ.. త్రీడీ లెవిల్ లో రిఫ్లెక్ట్ అవుతోంది. శౌర్య చేతిలో దాదాపు అరడజను సినిమాలున్నాయి. అందులో `లక్ష్య` ఒకటి. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ సినిమా కోసమే శౌర్య తన ఫిట్నెస్ లెవిల్స్పెంచుకున్నాడు. మరోవైపు `వరుడు కావలెను` సిద్ధమవుతోంది. అది పూర్తిగా క్లాస్ టచ్‌తో సాగే పాత్ర. ఆ సినిమాలో మాత్రం క్లీన్ అండ్ గ్రీన్ శౌర్యని చూడొచ్చు. మొత్తానికి రెండు కథలు, రెండు డిఫరెంట్ పాత్రలు ఒకే సీజన్ లో పూర్తి చేయబోతున్నాడు.