చిరంజీవి – మోహన్ బాబు మధ్య ఓ విచిత్రమైన బంధం ఉంటుంది. ఇద్దరూ బయటి ప్రపంచానికి ఎడమొహం – పెడమొహంలా కనిపిస్తారు. కానీ.. నిజ జీవితంలో ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ లా మెలుగుతుంటారు. `మాది టామ్ అండ్ జెర్రీ బంధం` అంటూ చిరు చాలాసార్లు మోహన్ బాబు గురించి ప్రస్తావించాడు. మోహన్ బాబు ఇంట్లో ఏ కార్యక్రమమైనా చిరు హాజరు తప్పని సరి. ఈమధ్య `సన్ ఆఫ్ ఇండియా` టీజర్ కి చిరు తన వాయిస్ ఓవర్ అందించాడు.
ఇప్పుడు మరోసారి అలాంటి సాయమే చేయబోతున్నట్టు టాక్. చిరు వాయిస్ ఓవర్ ని టీజర్ కే పరిమితం చేయడం లేదు. సినిమాలోనూ వినిపిస్తార్ట. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలన్నింటినీ చిరు తన గొంతు తో పరిచయం చేస్తారని వినికిడి. అంతేకాదు.. ఈ సినిమా విడుదలకు ముందు ఓ భారీ ఫంక్షన్ ఏర్పాటు చేసి, దానికి చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా పిలవాలన్నది మోహన్ బాబు ఆలోచన. అయితే… కరోనా హడావుడి తగ్గి, పరిస్థితులు అనుకూలిస్తేనే.. ఫంక్షన్ ఏర్పాటు చేస్తార్ట. మొత్తానికి మరోసారి మోహన్ బాబు సినిమాకి చిరు తన చేయూత అందిస్తున్నాడన్నమాట.