ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నలుగురు తమ పార్టీ నేతల్నిఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో నామినేట్ చేసింది. వారిలో ముగ్గురిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని ఆరోపణలు వచ్చినా…సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ అయి వివరణ ఇచ్చే సరికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఆ నలుగురిలో ఒకరి పేరు … రోజు రోజుకు వివాదాస్పదమవుోతంది. ఆ ఎమ్మెల్సీనే తోట త్రిమూర్తులు. తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై దళిత సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి. దీనికికారణంగా ఆయనపై శిరోముండనం కేసు ఉంది. కొన్నేళ్ల క్రితం… ఓ దళిత యువకుడ్ని కొట్టి శిరోముండనం చేయించారు. ఆ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది.
ఇప్పటికీ నడుస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీలో చేరడం ద్వారా ఆ కేసులో ముందడుగు పడకుండా తోట త్రిమూర్తులు జాగ్రత్త పడుతూ వస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న ఆయన .. గత ఎన్నికల్లో ఓడిపోయారు. వెంటనే అధికార పార్టీ వైసీపీలో చేరారు. చేరినప్పటి నుండి ఏదో ఓ పదవి వస్తుందని ఆశతో ఉన్న ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్. వెంటనే ఆయనపై ఉన్న శిరోముండనం కేసు తెరపైకి వచ్చింది. ఆయనకు చిరకాల ప్రత్యర్థిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్.. శిరోముండనం కేసును నీరు గారుస్తున్నారంటూ గతంలో ఆరోపణలు చేశారు.
ఆయన ప్రోత్సాహంతోనే నిరసనలు జరుగుతున్నాయన్న చర్చలు కూడా వైసీపీలో ఉన్నాయి. కారణం ఆయన ఇయనా.. కాకపోయినా… దళితుల నిరసనలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి.. ముఖ్యంగా కోస్తాలో దళిత సంఘాలు యాక్టివ్ అయ్యాయి. ఆయన ఎమ్మెల్సీ పదవిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ చాయిస్ లేకపోయినా దళితుల ఆందోళనలు మాత్రం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. గతంలో టీడీపీ కూడా తోట త్రిమూర్తుల వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది.