వివేకానందరెడ్డి హత్య కేసులో మూడో సారి సీబీఐ బృందం పులివెందులకు వచ్చి విచారణ చేయడం ప్రారంభించి రెండు వారాలు గడిచిపోయింది. ప్రశ్నించిన వారినే ప్రశ్నిస్తే… ఈ రెండు వారాల సమయాన్ని సీబీఐ అధికారులు గడిపేశారు. వివేకా డ్రైవర్ దగ్గర్నుంచి ఆయన పొలం పనులు చూసే దశరథరామిరెడ్డి అనేవ్యక్తి వరకూ అందర్నీ మళ్లీ ప్రశ్నించారు. వారినందర్నీ ప్రశ్నిస్తే ఏమొస్తుందో.. ఏమి తెలుస్తుందో.. సీబీఐ వారికే తెలియాలి. అయినా తీగ లాగుతున్నారేమోనన్న కాస్త హోప్‌తో చాలా ఉంది. అన్నీ పనులు మానుకుని సీబీఐ అధికారులకు సహకరించేందుకు వివేకా కుటుంబసభ్యులు కూడా…పులివెందులలోనే ఉంటున్నారు. అడిగినప్పుడల్లా సమాచారం ఇస్తున్నారు. కానీ.. సీబీఐ అధికారులు మాత్రం అంతకు మించి మందుకు అడుగు వేయలేకపోతున్నారు.
సీబీఐ అధికారులు వివేకా హత్య కేసు చేధనలో ఎందుకో మొహమాటం పాటిస్తున్నారన్న విషయం ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఈ విషయంలో… వైఎస్ వివేకా కుమార్తెనే చాలా స్పష్టమైన ఆరోపణలు చేశారు. కడపలో అలాంటివి మామూలేనని వ్యాఖ్యానించారని.. ఢిల్లీలోనేఆరోపించారు. అయితే.. ఇప్పుడు సీబీఐ చీఫ్ మారారు. ఈ క్రమంలో బాబాయ్ హత్య కేసు నిందితులు కూడా బయటకు వస్తారన్న ఓ నమ్మకం బలపడింది. కానీ కొత్త సీబీఐ టీం కూడా ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ చేస్తున్న దాఖలాలు ప్రస్తుతానికి కనిపించడం లేదని ..నిందితులు వెలుగులోకి వస్తారని ఆశిస్తున్నవారు నిట్టూరుస్తున్నారు.
ఏ విధంగా చూసినా.. అది చాలా సులువుగా పరిష్కరించగలిగే కేసు., సీబీఐకి అయితే.. రెండు, మూడు రోజుల పని. కానీ… రోజుల తరబడి.. బృందాలకు బృందాలు వస్తున్నాయి కానీ ఏమీ తేల్చలేకపోతున్నారు. సాక్ష్యాలను మాయం చేసిన వారు.. ఘటనా స్థలంలోకి మొట్టమొదటగా వెళ్లినవారు.. పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చినవారు ఇలా అనేక మందిని ప్రశ్నించాల్సి ఉండగా.. డ్రైవర్లు.. పనివాళ్లతోనే కాలక్షేపాన్నిసీబీఐ చేస్తోంది. ఇంత సుదీర్ఘమైన విచారణ జరిపిన తర్వాతకూడా… నిందితుల్ని పట్టుకోకపోతే.. సీబీఐ చిత్తశుద్ధిపై ప్రజల్లో మరింత అనుమానం పెరిగే అవకాశం ఉంది.