హీరోగానే కాదు, నిర్మాతగానూ నాని సక్సెసే. తొలి ప్రయత్నంగా `అ` తీశాడు. ఆ తరవాత… `హిట్` వచ్చింది. రెండూ నానికి మంచి లాభాల్ని తీసుకొచ్చాయి. ఇప్పుడు `మీట్ క్యూట్` మొదలెట్టాడు. ఇది ఓ రకంగా లేడీ ఓరియెంటెడ్ సినిమా. ఇందులో ఏకంగా అయిదుగురు హీరోయిన్లుంటారని టాక్. ఆ అంకె పెరగొచ్చు కూడా. ఆ పాత్రల్లో పేరున్న కథానాయికలనే తీసుకోవాలన్నది నాని ఆలోచన. అన్నీ ఒకట్రెండు రోజుల పాత్రలే. అందుకోసం.. ఆయా హీరోయిన్లను `అతిథి` పాత్రలంటూ ఒప్పించగలిగాడు నాని. పారితోషికాలు ఇచ్చినా అవి నామ మాత్రమే. పైగా నాని సినిమా కాబట్టి, అదో ప్రయోగాత్మక సినిమా కాబట్టి.. హీరోయిన్లూ నటించడానికి రెడీ అంటున్నారు. సాధారణంగా హీరోయిన్లను ఒకట్రెండు రోజుల పాత్రలకు ఒప్పించడం చాలా కష్టం. ఒప్పుకున్నా. బాగా డిమాండ్ చేస్తారు. కానీ.. నాని దగ్గర ఎవరూ నోరు మెదపరు. మొహమాటం కొద్దో. అభిమానం కొద్దో… ఇచ్చినదంతా తీసుకుని చేస్తారు. అలానే ఈ సినిమా పూర్తి చేయాలనుకుంటున్నాడు నాని. తన నుంచి ఓ సినిమా వస్తోందంటే కచ్చితంగా మేటర్ ఉండే ఉంటుంది. పైగా తన సినిమాని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో నానికి తెలసు. కాబట్టి.. బిజినెస్ పరంగా ఈ సినిమా ముందే హిట్టు. సో… నిర్మాతగా నాని హ్యాట్రిక్ కొట్టేసినట్టే.