న్యూజీలాండ్ చరిత్ర సృష్టించింది. ఐసీసీ తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ ని గెలుచుకుంది. ఫైనల్ లో టీమ్ ఇండియాని 8 వికెట్ల తేడాతో ఓడించి.. ఘన విజయాన్ని అందుకుంది. దాదాపు 2 రోజుల ఆట వర్షార్పణమై… డ్రా వైపు మళ్లిన ఈ టెస్ట్ మ్యాచ్ ని న్యూజీలాండ్ తన అపూర్వమైన ఆటతీరుతో తమ వైపుకు తిప్పుకుంది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ కేవలం 170 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో… కివీస్ 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాల్సివచ్చింది. అశ్విన్ రెండు వికెట్లు సాధించి ఆశలు చిగురింప చేసినా… టేలర్(47). విలియమ్సన్ (52) పరుగులతో రాణించి.. కివీస్ కి గెలుపు తీరాలకు చేర్చారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 217 పరుగులకు ఆలౌటైంది. కివీస్ 249 పరుగులు చేయడంతో.. కీలకమైన 32 పరుగుల ఆధిక్యం సంపాదించగలిగింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ భారత బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. భారత బ్యాట్స్మెన్స్లలో ఒక్కరు కూడా అర్థ సెంచరీ సాధించలేకపోయారు.
ఇన్సింగ్స్‌లో ఒక్కరు కూడా 50 పరుగులు చేయకపోవడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి.