రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై స్టే ఉన్నా.. పనులు కొనసాగిస్తున్న వైనం.. చివరికి ఏపీ చీఫ్ సెక్రటరి ఆదిత్యనాథ్ దాస్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ మేరకు.. తాము స్టే ఇచ్చినప్పటికీ పనులు జరిగాయని తెలిస్తే చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతామని హెచ్చరిస్తూ.. తాజాగా వ్యాఖ్యలు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పనులు స్టే ఇచ్చినా చేస్తున్నారంటూ తెలంగాణకు చెందిన గరిమెళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి … పనులు జరుగుతున్న ఫోటోలు, దృశ్యాలతో ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరిపిన ఎన్జీటీ ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. తక్షణం… రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతంలో ఉన్న పరిస్థితిని.. నిర్మాణాలు ఏమైనా జరిగాయేమో చెప్పాలంటే్… కృష్ణా రివర్ బోర్డుని… పర్యావరణశాఖకు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల పన్నెండో తేదీన తదుపరి విచారణ జరగనుంది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర జల వివాదాలకు కారణం అవుతోంది. అనుమతులు లేకుండా… డీపీఆర్ లేకుండా… నిర్మిస్తున్నారని.. ఎన్జీటీ స్టే ఇచ్చినా నిర్మాణ పనులు జరుగుతున్నాయంటూ.. తెలంగణ సర్కార్ కొద్ది రోజులుగా ఆరోపిస్తోంది. అంతే కాదు..గతంలో కేఆర్ఎంబీకి కూడా ఫిర్యాదు చేసింది. ఆ ప్రాజెక్ట్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు కేఆర్ఎంబీ ప్రయత్నించింది. అయితే.. ఏపీ సర్కార్ తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేసింది. కరోా కారణం.. ఇతర కారణాలు చెప్పి.. పర్యటనకు అంగీకరించలేదు. దాంతో… అక్కడ పరిస్థితిని కేఆర్ఎంబీ పరిశీలించలేకపోయింది.
ప్రస్తుతం ఎన్జీటీ .. అటు కృష్ణాబోర్డుతో పాటు పర్యావరణ శాఖను కూడా అక్కడి పరిస్థితిపై వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో వారు అక్కడ తప్పక పర్యటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ప నులు ఏమైనా జరుగి ఉంటే.. ఖచ్చితంగా సీఎస్ బాధ్యుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కృష్ణాబోర్డును కానీ.. పర్యావరణశాఖను కూడా … అక్కడ పరిశీలించకుండా ఆపే పరిస్థితి లేదు. కాంట్రాక్ట్‌ను …మెఘా కన్సార్టియంకు ప్రభుత్వం ఇచ్చింది. అనుమతుల్లేకపోయినా పనులు వేగంగా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ పెద్ద ఎత్తున యంత్రాలు.. ఇతర సామాగ్రితోపాటు పనులు చేస్తున్న దృశ్యాలు తెలంగామకు చెందిన కొంత మంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.