http://www.youtube.com/watch?v=0t07D8dgqDM
డిటెక్టీవ్ కథలు భలే ఆసక్తిగా ఉంటాయి. పోలీసులు ఛేదించలేని కేసుల్ని.. డిటెక్టీవ్ లు తమ మేధస్సుతో ఎలా పట్టుకోగలిగారు? అనేది ఎప్పటికీ ఆసక్తికరమే. అందుకే తెలుగులో వచ్చిన డిటెక్టీవ్ సినిమాలన్నీ దాదాపుగా హిట్టే. లేటెస్టుగా `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ` సూపర్ హిట్టు కొట్టింది.ఇప్పుడు సునీల్ కూడా… ఆ పాత్రలోకి ఒదిగిపోయాడు. సునీల్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం `కనబడుటలేదు`. ఓ మిస్సింగ్ కేసు, మర్డర్, ఇన్విస్టిగేషన్.. ఇలా సాగే కథ ఇది. పోలీసులకు అంతుపట్టని ఈ కేసు.. డిటెక్టీవ్ ఎలా సాల్వ్ చేశాడన్నది చూపిస్తున్నారు. టీజర్ ఈ రోజే విడుదలైంది. నేర పరిశోధన చిత్రాలు ఎలా ఉంటాయో.. ఆ ఫార్మెట్ లోనే కనిపించింది. టీజర్ లో షాట్లూ, ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్… అన్నీ బాగున్నాయి. కాకపోతే… మేకింగ్ లోనే క్వాలిటీ తగ్గిన ఫీలింగ్ కలుగుతోంది. సునీల్ ఈమధ్య కొత్త తరహ ఆపాత్రలు చేస్తున్నాడు. విలన్ గానూ మెప్పిస్తున్నాడు. తనకు ఇది కొత్త అనుభవమే. మరి బాక్సాఫీసు దగ్గర ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.