రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కత్తిమహేష్ కి అయిన గాయాల తీవ్రత దృష్ట్యా ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేయాలని అనుకున్నారు. అయితే… బ్రెయిన్ ఇంజ్యూరీ పెద్దదేం కాదని డాక్టర్లు నిర్దారించారు. ఆపరేషన్ చేసే అవకాశాలు స్వల్పంగానే ఉన్నాయని సమాచారం. నిన్నటి వరకూ.. కత్తి మహేష్ ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నాడు. కానీ.. ఇప్పుడు ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు భరోసా కూడా ఇచ్చారని సమాచారం. కంటి భాగంలో ఆయనకు బాగా దెబ్బ తగిలిన దృష్ట్యా కంటి ఆపరేషన్ అవసరం కానుంది. అంకోసం ఆయన్ని చెన్నై తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కత్తిమహేష్ ఆరోగ్య స్థితి తెలుసుకుని, చాలామంది సన్నిహితులు, రాజకీయ నేతలు, సినీ సెలబ్రెటీలూ సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అయితే కత్తిమహేష్ కి ఆర్థిక ఇబ్బందులేం లేవని, అవసరమైతే దాతల సహాయం తీసుకుంటామని సన్నిహితులు చెబుతున్నారు.