ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీ మోహన్ ప్రస్తుత తెలుగు సినీ పరిశ్రమ స్థితి గతుల పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రస్తుత తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు చిరంజీవి గారే అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దాసరి నారాయణ రావు ఉన్నంత కాలం ఆయన తెలుగు సినీ పరిశ్రమ కి పెద్ద దిక్కు గా ఉండే వారినే సంగతి తెలిసిందే. అయితే ఆయన అనంతరం ఆయన స్థాయి లో కాక పోయినా కొంత వరకు చిరంజీవి ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజా గా మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం గా కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
తాజా గా టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ మురళీ మోహన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సారి అప్పట్లో చిరంజీవి గారి దగ్గర కూర్చున్నప్పుడు – ఏవండీ గతంలో తెలుగు సినీ పరిశ్రమ లో ఎవరికి ఏదైనా సమస్య వచ్చినా అప్పట్లో పెద్ద దిక్కుగా ఉన్న దాసరి నారాయణ రావు గారి దగ్గరకు వెళ్లేవారు, కానీ ప్రస్తుతం పెద్ద దిక్కు లాంటి ఆయన లేకుండా పోయారు, మీ లాంటి వారు ఆ బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అని తాను చిరంజీవి తో అన్నట్లు మురళీమోహన్ వెల్లడి చేశారు. మీరు తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ హీరో గా ఉన్నారు, నిర్మాత గా చేస్తున్నారు, ఎంపీ గా కేంద్ర మంత్రి గా బాధ్యతలు నిర్వహించారు, కాబట్టి మీరు ఆ బాధ్యత తీసుకుంటే బాగుంటుందని చిరంజీవి తో తాను అన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే దానికి చిరంజీవి సమాధానమిస్తూ, దాసరి నారాయణ రావు గారు చేసినంత గొప్పగా తాను చేయగలనా అని సందేహాన్ని వ్యక్తం చేశారని, కానీ ఆ తర్వాత చిరంజీవి గారు తెలుగు సినీ పరిశ్రమ కు పెద్ద దిక్కు గా మారిపోయారని మురళీమోహన్ వ్యాఖ్యానించారు.
ఇవాళ్టి రోజున సినీ పరిశ్రమ లో ఉన్న వాళ్ల లో – సినీ పరిశ్రమ కి సంబంధించిన వ్యక్తుల మధ్య ఏ సమస్య వచ్చినా చిరంజీవి గారే దాని పై స్పందించి పరిష్కరించడానికి చొరవ చూపుతున్నారని, ఆయన కి ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల అయితే నేమి, ఆయన కి ఉన్న ఆర్థిక బలం వల్ల అయితేనేమి ఆయన కి ఉన్న మంచి తనం వల్ల అయితే నేమి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయనకు చెప్పుకో గలుగుతున్నారు అని మురళీ మోహన్ వ్యాఖ్యానించారు . కరోనా సమయంలో ఆయన తన వైపు నుండి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా, తన పిల్లలు, తన కుటుంబాని కి చెందిన ఇతరులు ఎంతో ఆర్థిక సహాయం చేశారని, పేద టెక్నీషియన్ల కు పేద కళాకారుల కు నెల వారీ సరుకులు కరోనా సమయంలో ఆయన పంపించారని, ఎంతో మంది ని ఆదుకున్నారని, అలాగే సినీ కార్మికుల కు వ్యాక్సిన్ చేయించడం, కరోనా సమయం లో అవసరమైన వారి కి ఆక్సిజన్ అందేలా చేయడం వంటి అనేక పనులు ఆయన చేశారని, నిజం గా ఇవ్వాళ తెలుగు సినీ పరిశ్రమ కు ఆయన పెద్ద దిక్కు గా మారి పోయారని మురళీ మోహన్ వ్యాఖ్యానించారు. అయితే ఇలా సినీ పరిశ్రమ ని ఆదుకునే విధంగా చిరంజీవి లాంటి పెద్దలు మరో ఇద్దరు ముగ్గురు ఉంటే పరిశ్రమ లోని సమస్యలు మరింత త్వరగా, సామరస్యం గా పరిష్కారం అవుతాయని మురళీ మోహన్ వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా ఇటీవల కాలం లో చిరంజీవి రాజకీయ పరం గా తటస్థ వైఖరి ని అవలంబిస్తూ, పరిశ్రమ లో ని అన్ని వర్గాల కి దగ్గరవుతూ, పరిశ్రమ పెద్ద దిక్కు గా వ్యవహరిస్తున్నాడు అనడం లో సందేహం లేదు