మా ఎన్నికల ఘట్టం రసవ్తరంగానే మొదలైంది. మూడు నెలల ముందే… వేడి రాజుకుంది. ప్రకాష్ రాజ్ వెనుక చిరంజీవి అండదండలున్నాయని తెలియగానే, మరోసారి అందరి దృష్టి మెగా కాంపౌండ్ పై పడింది. చిరు సపోర్ట్ ఉంటే `మా`లో గెలుపు సులభం అవుతుందన్నది అందరి నమ్మకం. అందుకే చిరు `ఎస్..` అన్నాకే ప్రకాష్ రాజ్రంగంలోకి దిగాడని తెలుస్తోంది.
ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ పేరు మా ఎన్నికలలో వినిపించిందో, అప్పుడు మోహన్ బాబు వర్గం కూడా అలెర్ట్ అయ్యింది. తనయుడు విష్ణుని రంగంలోకి దింపారు. విష్ణుని పోటీ దించాలనుకున్నప్పుడు మోహన్ బాబు చిరుకి ఫోన్ చేసి, మద్దతు అడిగారని, అయితే చిరంజీవి సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. `ఆల్రెడీ ప్రకాష్ రాజ్ కి మాటిచ్చేశా.. ` అని చిరు చెప్పారని ఇన్ సైడ్ వర్గాల టాక్. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ఈ ఎన్నికలలో పోటీ చేయడం లేదు. `నేను ఈ ఒక్క దఫానే అధ్యక్షుడిగా ఉంటా.. ఆ తరవాత మరోకరికి అవకాశం ఇస్తా` అని ఆయన ముందే చెప్పారు. కాకపోతే.. `మా`లో కనీసం వందమంది సభ్యుల మద్దతు నరేష్ కి ఉందని తెలుస్తోంది. వాళ్లంతా.. ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా ఓటు చేసే అవకాశం ఉంది. అలా.. ఈ ఎన్నికల్ని నరేష్ సైతం గట్టిగా ప్రభావితం చేయబోతున్నాడు. ప్రకాష్‌రాజ్ కి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగితే… విష్ణుకి లాభం చేకూరుతుంది. అలా.. ఈ ఎన్నికలలో విష్ణు గెలుపుకి నరేష్ పరోక్షంగా కారణం అవ్వొచ్చని `మా` సభ్యుల ఇన్ సైడ్ టాక్.