“నన్ను బయటకు పంపేసి .. వాళ్లిద్దరూ లోపలికి వెళ్లి తలుపులేసుకుంటారు. అసలు పెళ్లి కాని నాకు వాళ్లిద్దరూ ఏం చేస్తుంటారోనని ఒకటే టెన్షన్..” అని చేతులు నులుముకుంటూ.. తన బాధను స్నేహితుల దగ్గర వ్యక్తం చేస్తాడు.. కృష్ణ సినిమాలో వేణుమాధవ్. ఇప్పుడు టీవీ9 బాధ కూడా అలాగే ఉంది. ఆరియానా, ఆర్జీవీ ఏం చేస్తున్నారనేది ఇప్పుడు టీవీ9కి ఎవరికీ లేనంత టెన్షన్‌గా ఉంది. ఎలాగైనా తెలుసుకోవాలని.. నేరుగా రజనీకాంత్ కూడా రంగంలోకి దిగారు. ఓ ప్రైమ్ టైమ్‌లో ఆర్జీవీని కూర్చోబెట్టి అడిగారు. ఆ తర్వాత ఆరియానాను కూడా మరో మరో లేడీ యాంకర్‌తో ఇంటర్యూ చేయించారు.
ఇద్దరూ చెప్పిందే చెప్పారు.. ఒకరినొకరు పొగుడుకున్నారు కానీ.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఉందా లేదా.. ఉంటే ఎలాంటి కెమిస్ట్రీ.. లాంటి విషాయలనేమీ చెప్పించలేకపోయారు. కానీ టీవీ9 ఆత్రం చూసిన వారికి మాత్రం.. ఇదేం పిచ్చి అనిపిస్తోంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆరియానా.. ఇటీవలి కాలంలో ఆర్జీవీతో కలిసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఓ ఇంటర్యూలో “బోల్డ్” అన్న కంటెంట్ తో ఇంటర్యూ కూడా చేసినట్లుగా ప్రచారం చేసుకున్నారు.
కానీ ఆర్జీవీ అప్పటికే మియా మాల్కోవా లాంటి వారితో …బోల్డ్ కాదు.. అంతకు మించి సినిమాలు తీసి ఉన్నారు. అలాంటప్పుడు.. బోల్డ్ అనే పదానికి అర్థం ఉండదు. కానీ టీవీ9కి మాత్రం ఇద్దరి మధ్య ఏదో ఉందని.. ఏదో జరుగుతోందని.. అది తమకు తెలియాలని.. ప్రజలకు చెప్పాలని ఆరాటపడుతోంది. సోషల్ మీడియా కంటెంట్‌ను టీవీకి ఎక్కించి.. టీఆర్పీలు తెచ్చుకుందామనుకున్న టీవీ9కి … వ్యూయర్స్ నుంచి మాత్రం.. విచిత్రమైన ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఆ ఫీడ్ బ్యాక్‌ను.. టీవీ9 ఎడిటోరియల్ పెద్దలు తలకెక్కించుకుంటారో లేదో మరి..!