జెఎన్‌యు విద్యార్థినేతలపై వేట, అరెస్టులు దేశ ద్రోహ ప్రచారాల విషయంలో బిజెపి రాజకీయ పాచికలు వరుసగా బెడిసికొడుతున్నాయి. తదుపరి ఘట్టం ఇప్పటికి అయోమయంగానే వుంది. జాతీయ పార్టీల నేతలు రాష్ట్రపతికి నేరుగా ఫిర్యాదు చేశారు గనక ఆయన కూడా కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరే అవకాశం వుంది. తమ నాయకుల పోకడలు భరించలేక ఎబివిపికి ముగ్గురు ప్రతినిధులు రాజీనామా చేయడం ఆ సంస్థకు ఎదురుదెబ్బనే.విశ్వ విద్యాలయాల్లో ఉద్రిక్తత పెంచింది చాలక న్యాయాలయాల్లోనూ దౌర్జన్యశక్తుల విలయతాండవం అందరికీ ఆందోళన కలిగిస్తున్నది. ఆఖరుకు ఆర్థిక మంత్రి సీనియర్ నేత అరుణ్‌జైట్టీ కూడా ఖండించక తప్పని స్థితి ఏర్పడింది. ఈ సమయంలోనే దాడి జరగలేదని పక్షపాత ప్రకటన చేసిన ఢిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ పక్షపాతం ఆరోపణలు మూటకట్టుకున్నారు. విద్యార్థులను కోర్టుకు తాము సురక్షితంగా అప్పగించాము గనక బాధ్యత లేదన్న వ్యాఖ్య ఎవరూ ఆమోదించేది కాదు. పైగా సమాచార కమిషనర్‌గా పదవి మారే ప్రయత్నంలో బస్సీ వుండటం కూడా ఇరకాటాన్నే సూచిస్తుంది.ఏమైనా ఈ మాటలపై ఆగ్రహౌెదగ్రమైన అత్యున్నత న్యాయస్థానం దాడులను పోలీసులను కూడా తీవ్రంగానే ఖండించింది. దేశభక్తిపేరుతో కోర్టులో అసందర్భంగా వందేమాతరం పాడి అతి చేసిన ప్రబుద్దులకు న్యాయమూర్తుల మందలింపుతో పాటు వారి పేరు వివరాల నమోదుచేయాలన్న ఆదేశాలు కూడా వచ్చాయి. ఢిల్లీ బార్‌కౌన్సిల్ అద్యక్షుడు కూడా విద్యార్థులకు హెచ్చరికలు చేస్తూనే తప్పుచేసిన తమవారిపై చర్య తీసుకుంటామని చెప్పాల్సి వచ్చింది. ఇంకో వైపున కన్నయ్య కుమార్‌కు మద్దతు పెరిగింది. (ఒకప్పట)ి బీహార్ బిజెపి తార ఎంపి శతృఘ్నసిన్హా నోబుల్ గ్రహీతలు అమర్త్యసేన్‌తో సహా 300 మంది ప్రపంచ స్థాయి మేధావులు అధ్యాపకుల మద్దతు లభించింది. ఆయన ప్రసంగం చాలా అద్బుతంగా వుందని ప్రశంసలు ఒకవైపున వస్తుంటే కన్నయ్య దేశవ్యతిరేక నినాదాలు చేసినట్టు ఆధారాలు లేవని పోలీసుల నివేదిక పత్రికలో ప్రచురితమైంది. కాకుంటే తమ దగ్గర తగు ఆధారాలున్నాయని మాత్రమే పోలీసులు వివరణ విడుదల చేశారు. మా కుమారుడు క్షేమంగా నిర్దోషిగా బయిటపడతాడన్న కన్నయ్య తలిదండ్రుల విశ్వాస ప్రకటన మారిన పరిస్థితికి నిదర్శనంగా వుంది. ఒకప్పుడు అరెస్టులు బెదిరింపులతో అదరగొట్టిన వైస్‌ఛాన్సరల్ నిరసన ప్రదర్శన రద్దు చేసుకోవాలని విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ విజ్ఞప్తులుచేస్తున్నారు. మొత్తంపైన నైతికంగా రాజకీయంగా జెఎన్‌యు విద్యార్థులు మరింత నిలదొక్కుకోగా ప్రభుత్వం పూర్తిగా ఆత్మరక్షణ స్థితిలో పడిపోయిన తీరుకు ఇవన్నీ నిదర్శనాలు. హెచ్‌సియు టు జెఎన్‌యు వ్యూహాన్ని ఇకనైనా విరమిస్తారేమో చూడాలి!