కల్యాణ్ రామ్ కథానాయకుడిగా అభిషేక్ పిక్చర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు కల్యాణ్ రామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటు.. టైటిల్ ని కూడా రివీల్ చేశారు. ఈ చిత్రానికి `డెవిల్` అనే పేరు పెట్టారు. `ద బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్` అనేది ఉపశీర్షిక. కోటు, చేతిలో పిస్టల్ తో.. కల్యాణ్ రామ్ గెటప్ వైవిధ్యంగా ఉంది. 1940.. ఆ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో కల్యాణ్ రామ్ గూఢచారిగా నటించబోతున్నాడు. స్వాతంత్య్రం రాక ముందు జరిగే కథ ఇది. అప్పట్లో గూఢచారి వ్యవస్థ ఎలా ఉండేది? అనే విషయంపై బాగా పరిశోధన చేసి మరీ ఈ కథని రాసుకున్నార్ట. కల్యాణ్ రామ్ ఈ తరహా కథలో నటించడం ఇదే తొలిసారి. కల్యాణ్ రామ్ నటిస్తున్న `బింబిసార`కీ చారిత్రక నేపథ్యం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ఒకేసారి.. రెండు సినిమాల్లోనూ కాలాన్ని వెనక్కి తిప్పే కథలే చెప్పబోతున్నాడన్నమాట కల్యాణ్ రామ్.