టాలీవుడ్ మళ్లీ షూటింగులతో కళకళలాడుతోంది. సుదీర్ఘ విరామం తరవాత.. స్టార్స్ అంతా సెట్స్ బాట పట్టారు. పవన్ కల్యాణ్ కూడా అతి త్వరలోనే… మేకప్ వేసుకోబోతున్నారు. పవన్ ప్రస్తుతం `వీరమల్లు`తో పాటు `అయ్యప్పయుమ్ కోషియమ్` రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 12 నుంచి `అప్పయ్యయుమ్` కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. 12నే పవన్ కూడా సెట్స్ లోకి వస్తున్నాడట. పవన్ కి తోడుగా ఈసారి నిత్యమీనన్ కూడా రాబోతోంది. ఈ రీమేక్ లో నిత్యమీనన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారి తాను కూడా సెట్స్‌లోకి అడుగుపెట్టబోతోంది. 12 నుంచి 18 వరకూ సాగే ఈ షెడ్యూల్ లో.. పవన్, నిత్యలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ఈ సినిమా కోసం `పరశురామ కృష్ఱమూర్తి` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాకి ఇదే టైటిల్ అని.. ప్రచారం జరుగుతోంది. అయితే.. చిత్రబృందం టైటిల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న విషయం తెలిసిందే. టైటిల్ బాధ్యత కూడా ఆయనపూనే ఉంది. త్రివిక్రమ్ కి `అ` సెంటిమెంట్ ఉంది. ఆ అక్షరంతో మొదలయ్యే టైటిల్ కోసం ఆయన అన్వేషణ మొదలెట్టారని సమాచారం.