తాప్సి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. తెలుగు, తమిళం, హిందీ… ఇలా ఎక్కడైనా సరే. తనకు మంచి గుర్తింపు ఉంది. అందుకే తాప్సి బిజీ స్టార్ అయిపోయింది. తాజాగా తెలుగులో మరో కొత్త సినిమా ఒప్పుకుంది. అదే `మిషన్ ఇంపాజిబుల్`. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయతో ఆకట్టుకున్న స్వరూప్ దర్శకుడు. ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ఈ రోజు మొదలైంది. తొలిసారి సెట్లోకి తాప్సి అడుగుపెట్టింది.
అయితే ఈ సినిమాకి తాప్సి పారితోషికం ఏమీ తీసుకోవడం లేదట. ఆ స్థానంలో హిందీ ఓటీటీ రైట్స్ ని తాప్సి పేర రాసిచ్చేయాలట. నిజంగా ఇది పెద్ద డీలే. తాప్సికి బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. ఓటీటీ రూపంలో కనీసం రూ.5 నుంచి 8 కోట్లయినా రావొచ్చు. ఇదంతా తాప్సి పేరిట వదిలేయాలన్నమాట. `మిషన్ ఇంపాజిబుల్`ని హిందీలోనూ విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అక్కడ తాప్సికున్న మార్కెట్ ప్రకారం మంచి రేటే గిట్టుబాటు అవుతుందన్నది నిర్మాతల లెక్క. అందుకే తాప్సి డీల్ కి ఒప్పుకున్నార్ట. ఈ లెక్కన సౌత్ లో అందరికంటే తాప్సినే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నట్టు లెక్క.