తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీసే అతి కొద్ది స్వరాల్లో ఒకటి టీవీ5 మూర్తిది. ఆయన ప్రస్తుతం టీవీ5 తెర మీదకు రావడం లేదు. ఆయన తెర మీదకు రావడం లేదని గమనించిన కొంత మంది.. ఆయనను టీవీ5 నుంచితొలగించారని ప్రకటించేసి.. రకరకాల ఆరోపణలతో కథలు సృష్టించేశారు. ఆయనపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు కూడా రాసేశారు. అయితే అదంతామూర్తి గురించి తెలియని వారు.. ఆయన జర్నలిజంతమకు అనూకలంగా లేదన్న దుగ్ధతో కొంత మంది సృష్టించినవేనని ఆయన స్వయంగా టీవీ5 తెర మీదకు వచ్చి తేల్చేశారు.
వ్యక్తిగత కారణాల వల్లనే తాను కొంత కాలం సెలవు తీసుకున్నానని .. ఇందులో రాజకీయం ఇతర కారణాలు లేవని తేల్చి చెప్పారు. మూర్తి అవివాహితుడు. ఆయనకు వృద్దులైన తల్లిదండ్రులు ఉన్నారు. బహుశా… వారి గురించి కేర్ తీసుకోవడానికి ఆయన కొంత కాలం ఉద్యోగానికి సెలవు పెట్టినట్లుగా భావిస్తున్నారు. అయితేతన వ్యక్తిగత అవసరం ఏమిటో ..కుటుంబ పరంగా నిర్వహించాల్సిన బాధ్యతలు ఏమిటో చెప్పలేదు. అది వ్యక్తిగతం అని అనుకోవచ్చు. అయితే మూర్తి మాత్రం కొన్నాళ్ల పాటు టీవీ స్క్రీన్‌పై కనిపించరని మాత్రం క్లారిటీవచ్చేసింది.
ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా వాయిస్ వినిపించే ప్రయోక్తల్లో ఒకరైన మూర్తి.. కొన్నాళ్ల పాటైనా మీడియాకు దూరం కావడం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊరటనిచ్చే అంశమే. కానీ ఆయనను రెచ్చగొట్టేందుకు మాత్రం వాళ్లు వెనుకాడటం లేదు. వైసీపీ సోషల్ మీడియా పోస్టులు చూసి.. తెరపైకి వచ్చి చెప్పాల్సినదంతా చెప్పిన మూర్తి… మళ్లీ ఎప్పుడు స్క్రీన్ మీదకు వస్తారో చెప్పలేదు. అంటే కొన్నాళ్ల పాటు.. ఓ బలమైన ప్రజా గొంతుక… సైలెంట్ అయినట్లే.