ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన రూ. 41వేల కోట్ల నిధుల ఖర్చు వివరాలు లేవని తెలుగుదేశం పార్టీ గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం సంచలనాత్మకమైంది. ఈ విషయంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పేరుతో వివరణ విడుదలైంది. అయితే… అసలేం జరిగిందో పూర్తిగా చెప్పకుండా.. డొంక తిరుగుడుగా సమాధానం ఇచ్చి.. మరిన్ని అనుమానాలు పెంచేలా చేశారు… ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి. స్పెషల్ బిల్ కేటగిరీ కింద 10 వేల 806 బిల్లులకు సంబంధించి..41 వేల పైచిలుకు మొత్తాన్ని విత్ డ్రా చేశారని చెబుతున్నారని.. కానీ ఆ మొత్తాలు పలు కారణాలతో అడ్జస్ట్మెంట్ జరిగాయని ఆర్థిక శాఖ వివరించింది.
పీడీ అకౌంట్లోకి విడుదల చేసిన ఫండ్స్ వినియోగించకపోవడంతో.. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం లాప్స్ అయ్యాయని విరవణలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి చెప్పుకొచ్చారు. అందుకే పిడి అకౌంట్స్ మధ్య అడ్జస్ట్మెంట్లు జరిగాయిని.. అకౌంటింగ్ యూనిట్ ఖర్చు సేమ్ హెడ్ ఆఫ్ ది అకౌంట్లో సరిదిద్దారని వివరించారు. ఫెయిలైన పేమెంట్లు రీ ప్రాసెసింగ్ చేయకపోవడంతో సమస్య తలెత్తిందని..అలాగే.. జీఎస్టీఎన్ లో రెగ్యులర్ బిల్లులకు టీడీఎస్ అడ్జస్ట్మెంట్ రికవరీ చేయకపోవడం ఈ అపోహ తలెత్తడానికి కారణం అని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఫైనాన్షియల్ కోడ్ ఆధారంగానే ట్రాన్సక్షన్లు జరిగాయని.. రూ. 41వేల కోట్ల గోల్‌మాల్‌పై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
అయితే ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన వివరణలో.. విపక్షం లేనెత్తిన అనేక ప్రశ్నలకు సమాధానం లేదు. చెల్లింపులు జరిగినట్లుగా స్పష్టంగా ఉన్నాయని .. ఈ విషయాన్ని అకౌంటెంట్ జనరల్ కూడా లేఖ రాశారని.. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం.. పీడీ అకౌంట్లలో ల్యాప్స్ అయ్యాయని చెబుతోంది. ఆర్థిక శాఖ వివరణ మరింత గందరగోళం సృష్టించేలా ఉండటంతో.. అసలు నిధుల గోల్ మాల్ గురించి బయటపడాలంటే.. కాగ్‌తో పూర్తి స్థాయి ఆడిట్ చేయించాలన్న అభిప్రాయం మాత్రం అంతటా వినిపిస్తోంది.