`వెంకీ మామ`తో ఓ సూపర్ హిట్టు కొట్టాడు బాబి. అయితే ఆ తరవాత.. బాబి సినిమాఏదీ పట్టాలెక్కలేదు. కాకపోతే… చిరంజీవితో ఓ సినిమా చేసే ఛాన్సు మాత్రం కొట్టేశాడు. చిరు – బాబి కాంబో సెట్టవ్వడం నిజంగానే ఇండ్రస్ట్రీ వర్గాల్ని షాక్ కి గురి చేసింది. ఈ అవకాశం బాబీకి ఇంత త్వరగా వస్తుందని ఎవరూ అనుకోలేదు. అయితే ఈ ప్రాజెక్టు ఎంత వరకూ వచ్చింది? ఎప్పుడు మొదలవుతుంది? అనే డౌట్లు మాత్రం చాలానే ఉన్నాయి. వీటిపై బాబి క్లారిటీ ఇచ్చేశాడు. ఓ ఇంటర్వ్యూలో చిరు సినిమాకి సంబంధించిన కీలకమైన అప్ డేట్ ఇచ్చాడు.
ఈ సినిమా స్క్రిప్టు ఎప్పుడో రెడీ అయిపోయిందని, చిరుకి వినిపించడం కూడా జరిగిపోయిందని చెప్పాడు బాబి. అంతే కాదు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలైపోయాయట. ఓ పాటని రికార్డ్ చేయడం, చిరు కి వినిపించడం.. ఆయన మెచ్చుకోవడం ఇవన్నీ కూడా అయిపోయారు. “చిరుకి నేను వీరాభిమానిని. చదువుకునే రోజుల్లో ఆయన సినిమా క్యాసెట్ విడుదలైతే.. ఆ క్యాసెట్ కొని, పాతిక మంది కుర్రాళ్లం అంతా కలిసి డాన్సులు చేసేవాళ్లం. ఆ గ్యాంగ్ లోనేనూ ఉండేవాడ్ని. ఇప్పుడు నేనే చిరంజీవిగారితో సినిమా చేయడం, అందుకోసం ఓ పాట రికార్డ్ చేసి, ఆయనకు వినిపించడం ఇదంతా కలలా ఉంది. ఆచార్య ఆలస్యం అవ్వడంతో ఈ ప్రాజెక్టు లేట్ అయ్యింది. ఆచార్య అవ్వగానే లూసీఫర్ రీమేక్ మొదలెడతారు. ఆ సినిమాతో సమాంతరంగానే నా సినిమా కూడా ఉండొచ్చు. లేదా.. లూసీఫర్ అవ్వగానే.. నా సినిమా మొదలవుతుంది“ అని ఈ సినిమా గురించి చెప్పుకొచ్చాడు బాబీ.