రవితేజ కొత్త సినిమాకి `రామారావు` అనే టైటిల్ పెట్టారు. ఆన్ డ్యూటీ అనేది ఉపశీర్షిక. శరత్ మాండవ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో రవితేజ ఓ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నాడు. ప్రభుత్వ అధికారుల అవినీతి, అందులోని రాజకీయాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నారని టాక్. ఈ చిత్రానికి `ఎం.ఆర్.ఓ` అనే టైటిల్ పెడతారని ప్రచారం జరిగింది. అయితే `రామారావు` టైటిల్ తో షాకిచ్చాడు రవితేజ. నిజానికి.. ఇది బాలయ్య టైటిల్.
అనిల్ రావిపూడి బాలకృష్ణ ఓ కోసం ఓ కథ తయారు చేసుకున్నాడు. దానికి `రామారావుగారు` అనే టైటిల్ అనుకున్నాడు. ఇప్పుడు ఆ టైటిల్.. రవితేజ సొంతం అయినట్టైంది. బాలయ్య – అనిల్ రావిపూడి కాంబో త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అనిల్ రావిపూడి మరో టైటిల్ చూసుకోవాలిక.