రఘురామపై అనర్హతా వేటు వేయించడానికి చివరికి స్పీకర్‌కు పక్షపాతం ఆపాదించి.. సభకు స్తంభింపచేస్తామని కూడా హెచ్చరికలు చేస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సూటిగా సమాధానం ఇచ్చారు. అనర్హతా పిటిషన్‌పై చర్యలు తీసుకోవడానికి ఓ ప్రక్రియ ఉంటుందని.. ఇరువర్గాల వాదలను వినాల్సి ఉంటుందని గర్తు చేశారు. రన్నింగ్ కామెంటరీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సభను స్తంభింప చేస్తామన్న విజయసాయిరెడ్డి హెచ్చరికలపైనా… బిర్లా స్పందించారు. నిరసనలు తెలిపే హక్కు సభ్యులందరికీ ఉంటుందన్నారు. స్పీకర్ ఓం బిర్లా స్పందనను బట్టి చూస్తే.. రఘురామపై అనర్హతా పటిషన్కు మెరిట్ లేదని భావిస్తున్నట్లుగా ఉందన్న అంచనాలు వస్తున్నాయి.
అనర్హతా వేటుపై తుది నిర్ణయం చట్టసభల స్పీకర్లదేనని.. దానిపై కోర్టులు జోక్యం చేసుకోలేవని.. ఇటీవలే సుప్రీం కోర్టు స్పష్టమైన రూలింగ్ ఇచ్చింది. దీంతో… రఘురామపై అనర్హతా వేటు వేయకపోయినా… వైసీపీ ఎంపీలు కోర్టుకెళ్లే పరిస్థితి లేదు. స్పీకర్ దగ్గరే తేల్చుకోవాల్సి ఉంటుంది. స్పీకర్ కూడా.. దానికో ప్రక్రియ ఉంటుందని చెప్పడంతో ఆయన ఎప్పుడు.. ప్రక్రియ ప్రారంభిస్తే.. అప్పుడే చర్యలు ప్రారంభించినట్లు అవుతుంది. అయితే ఇప్పటికే …వైసీపీ ఫిర్యాదుల మేరకు… ప్రతీ ఫిర్యాదుకు కౌంటర్ రఘురామ స్పీకర్‌కు పంపుతూనే ఉన్నారు.
రఘురామపై అనర్హతా వేటును.. ఎంపీలకు ప్రత్యేక టాస్క్‌గా.. వైసీపీ హైకమాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే వారు ఢిల్లీలో హడావుడి పడుతున్నారు. వారానికోసారి బిర్లా దగ్గరకు వెళ్లి పిటిషన్ వేస్తున్నారు. అయితే.. ఆయన మాత్రం నింపాదిగానే ఉన్నారు. ఎన్ని సార్లు ఒత్తిళ్లు చేసినా.. ఆయన తాను చేయాలనుకున్నది చేస్తున్నారు. దీంతో అనర్హతా వేటు అనే టగ్ ఆఫ్ వార్‌లో ప్రస్తుతానికి రఘురామదే పైచేయి అయ్యే అవకాశం కనిపిస్తోంది.