ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు ఇప్పుడు దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం బహిరంగసభలోనో..మీడియా ముందో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే.. కోర్టును ఆశ్రయించవచ్చని.. ఢిల్లీ హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ .. లాక్ సమయంలో సొంత ఊళ్లకు వెళ్లిపోతున్న వలసకార్మికులను ఆపేందుకు పలు హామీలు ఇచ్చారు. అందులో… ఇళ్ల అద్దెలు కట్టలేని కార్మికులకు ప్రభుత్వమే ఇళ్ల అద్దె చెల్లిస్తుందని ప్రకటించారు. అయితే.. ఆ తర్వాత ఆ హామీని ఢిల్లీ సీఎం పట్టించుకోలేదు. దీంతో.. కొంత మంది కేజ్రీవాల్ ఇలా హామీ ఇచ్చారని.. కానీ ఇళ్ల అద్దె కట్టలేదని కోర్టులో పిటిషన్ వేశారు.
వీటిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. సీఎం ఇచ్చిన హామీలను అమలు కోరుతూ ప్రజలు కోర్టుకెక్కొచ్చని స్పష్టం చేసింది. ఒక వేళప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయలేకపోతే.. అదే విషయాన్ని ప్రజలకు నేరుగా చెప్పాలి కానీ.. ఏమీ చెప్పకుండా..అవి ఉత్తుత్తి హామీలని ప్రజలు అనుకుంటారని.. వాదించడం కరెక్ట్ కాదనిస్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. దేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా.. హామీల అమలు విషయంలో సీరియస్‌గా లేరు.
ఎప్పటికప్పుడు సమస్యల నుంచి గట్టెక్కడానికి హామీలు ఇవ్వడం.. మర్చిపోవడం పరిపాటిగా మారింది. చాలా రాష్ట్రాల్లో ఇలాంటి హామీలను గుర్తించి ప్రశ్నించినందుకు కేసులు కూడా పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు ఇచ్చిన ఆప్షన్ .. అనేక పరిణామాలకు కారమమయ్యేఅవకాశం ఉంది. ముఖ్యమంత్రులు హామీ ఇచ్చి మోసం చేశారని.. కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.