నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ లేనంతగా బిజీ ఇప్పుడు. ఆరుగురు నిర్మాతలు బాలయ్యకు అడ్వాన్సులు ఇచ్చారు. మరో ఆరుగురు వెయిటింగ్. సినిమా తరవాత సినిమాని, వీలైతే ఒకేసారి రెండు సినిమాల్ని పట్టాలెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. `అఖండ` అవ్వగానే గోపీచంద్ మలినేనితో సినిమా ఉంటుంది. ఆ తరవాత అనిల్ రావిపూడి సినిమా. కాకపోతే.. ఇప్పుడు బాలయ్య ఆలోచన మారింది. గోపీచంద్ మలినేని సినిమా అవ్వగానే పూరితో సినిమా చేయాలని ఫిక్సయ్యాడట. పైసా వసూల్ తరవాత బాలయ్యతో మరో సినిమా చేయాలని పూరి.. పూరికి మరో ఛాన్స్ ఇవ్వాలని బాలయ్య ఫిక్సయ్యారు. ఇప్పుడు ఇది వర్కవుట్ అయ్యింది. `పూరితో ఓ సినిమా చేస్తున్నా` అని బాలయ్య కూడా ఈమధ్య ప్రకటించారు. నిజానికి పూరి ఛాన్స్ రావడానికి చాలా టైమ్ పట్టాలి. కానీ.. బాలయ్య అనిల్ రావిపూడిని సైతం పక్కన పెట్టి, పూరితో సినిమా చేయాలని ఉత్సాహం చూపిస్తున్నాడు. అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా ఓకే అయినా… రావిపూడి ఇప్పటి వరకూ కథ వినిపించలేదని తెలుస్తోంది. మరోవైపు పూరి కథల విషయంలో చాలా స్పీడు. ఒక రోజులోనే కథ సిద్ధం చేయగల సమర్థుడు. బాలయ్య కోసం పూరి దగ్గర లైన్లు రెడీగా ఉన్నాయి. అందుకే రావిపూడి కంటే పూరికే ముందు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నాడట. అన్నీ కుదిరితే.. 2022లోనే ఈ కాంబో చూడొచ్చు.