అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో సుప్రీంకోర్టుకు ఆధారాలు సమర్పించలేక జ్ఞానోదయం అయిందని ఒప్పుకుని.. పిటిషన్ ఉపసంహరించుకుంది ఏపీ ప్రభుత్వం. కానీ బయట మాత్రం… అమరావతి పెద్ద స్కాం అని ప్రచారం చేయాలనే డిసైడ్ అయింది. ఈ మేరకు అనధికారిక ముఖ్యమంత్రిగా చెలామణి అవుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగానే తాము ఏం చేస్తామో కూడా ప్రకటించారు. అమరావతి పెద్ద స్కాం అని.. ఆ విషయం మీడియా మొత్తానికి తెలుసని .. మీడియా ముందుగానే ప్రకటించారు. సుప్రీంకోర్టు సాంకేతిక అంశాల ఆధారంగా తీర్పు ఇచ్చి ఉంటుందని చెప్పుకొచ్చారు. అమరావతిలో ఏం జరిగిందో అందరికీ తెలుసని..అదో పెద్ద స్కామని పదే పదే వ్యాఖ్యానించారు.
అమరావతి విషయంలో వైసీపీవి మొదటి నుంచి తీవ్రమైన ఆరోపణలే చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టారు. కానీ కోర్టుల ఎదుట నిరూపించలేకపోయారు. ఇష్టారీతిన ప్రచారం చేయడానికి… కొంత మంది ప్రజల మనసుల్లో అయినా… అమరావతిలో భారీ అవినీతి.. ఓ వర్గపు రాజధాని అన్న భావన నాటడం ద్వారా.. రాజకీయలాభం పొందాలన్న లక్ష్యంతో ఆరోపణలు చేశారు. కోర్టుల్లో నిలబడినా.. నిలబడకపోయినా… తమకు పోయేదేమీ లేదని.. కానీ అంతిమంగా రాజకీయలాభం కలుగుతుందని అంచనా వేశారన్న విశ్లేషణలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ఇప్పటికీ సుప్రీంకోర్టులోనూ ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై ఆధారాలు సమర్పించలేకపోయినప్పటికీ… అమరావతి పెద్ద స్కాం అని ప్రచారం చేయడానికే మొగ్గు చూపుతున్నారు.
అమరావతిని నిలిపివేయడం.. ఇష్టారీతిన ఆరోపణలు చేయడం.. వంటి వాటితో ప్రత్యక్షంగా భూములు ఇచ్చిన అమరావతి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం కూడా.. పెద్ద ఎత్తున నష్టపోయింది. యువత మంచి రాజధాని అవకాశాన్ని కోల్పోయారు. అయినప్పటికీ.. ఇప్పటికీ ఆరోపణలతోనే ఏపీ సర్కార్ పెద్దలు టైం పాస్ చేసి.. రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నారు. కానీ బాధ్యతగా… రాష్ట్ర భవిష్యత్ గురించి మాత్రం కనీస ఆలోచన చేయడం లేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తూనే ఉన్నాయి.