ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఓ ప్రాజెక్టు నిన్ననే.. పట్టాలెక్కింది. అదే.. ప్రభాస్ – నాగ అశ్విన్ సినిమా. అమితాబ్ బచ్చన్ కూడా సెట్లో అడుగుపెట్టడంతో మొత్తం అందరి దృష్టీ… ఈ ప్రాజెక్టుపై పడింది. ఈ సినిమాని ప్రస్తుతానికి `ప్రాజెక్ట్ కె…` అని పిలుచుకుంటున్నారు. ఆ కె ఏమిటన్నదే చిక్కు ప్రశ్న.
నిజానికి ఈ సినిమా టైటిల్ ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. ఆ టైటిల్ `కె`తో మొదలవుతుంది. ఆ టైటిల్ చెప్పేస్తే సినిమా జోనర్ ని, కాస్తలో కాస్త కథనీ ఈజీగా గెస్ చేయొచ్చు. అందుకే ఈ టైటిల్ ఇప్పుడే చెప్పకుండా దాచి పెడుతున్నారు. శనివారం నుంచి షూటింగ్ మొదలైందని అంతా అనుకుంటున్నా.. ఇది కేవలం ట్రైల్ షూట్ మాత్రమే. అసలైన షెడ్యూల్ ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో పాల్గొనే నటీనటులంతా ప్రస్తుతానికి ఫిల్మ్‌సిటీలో క్వారెంటైన్లో ఉన్నారు. వాళ్లకు సంబంధించిన జాగ్రత్తలన్నీ… వైజయంతీ మూవీస్ చూసుకుంటోంది. ఫిల్మ్‌సిటీలోని తార – సితార హోటెల్ మొత్తం `ప్రాజెక్ట్ కె` బృందంతో నిండిపోయింది. ఈ షెడ్యూల్ అయ్యేంత వరకూ అమితాబ్ బచ్చన్ ఇక్కడే ఉంటారు.