సీఐడీ సునీల్ కుమార్ విషయంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు.. వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఆయన తన ఫోన్‌ను అనధికారివాడారాని ఓ సారి ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారని,… దేశంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థలన్నింటికీ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయన మత విద్వేష వ్యాఖ్యలు చేశారని సీడీలతో సహా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. తర్వాత డీవోపీటీకి కూడా ఫిర్యాదు చేశారు. ఆయన బయటకు చెప్పకుండా.. మరికొన్ని వ్యవస్థలుకూ సీఐడీ సునీల్‌పై ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తోంది.
అయితే ఎన్ని ఫిర్యాదులు చేసినా కేంద్రం నుంచి పెద్దగా స్పందన ఉండటం లేదు. తాజాగా.. ఐపీఎస్ సునీల్ కుమార్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నిజం నిగ్గు తేల్చి నివేదిక ఇవ్వాల్సింది.. కేంద్ర సిబ్బంది వ్యవహారాలను చూసే డీవోపీటీ విభాగం హోంశాఖను ఆదేశించింది. డీవోపీటీకి సునీల్ కుమార్‌పై ఫిర్యాదు చేసింది రఘురామకృష్ణరాజునే. ఆయన మత విద్వేష వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదును.. ఆయన డీవోపీటికి పంపారు. దాన్నే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వారు హోంశాఖకు పంపారు. అయితే.. అంతకు ముందే హోంశాఖకు ఈ అంశంపై ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణరాజు.
కేంద్ర హోంశాఖ దీనిపై స్పందించింది. ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. రఘురామ లేఖ, సునీల్ ప్రసంగ వీడియోల ఆధారంగా.. తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్‌ను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. సునీల్ కుమార్ తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. కానీ ఇక్కడ ఏపీ ప్రభుత్వంలో అదనపు డీజీ హోదాలో ఉన్న సునీల్ కుమార్.. అంతకు మించి పవర్ ఫుల్ అధికారం చెలాయిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా చీఫ్ సెక్రటరీ కూడా నివేదిక ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే.. ఆయనపై ఏ చర్యలూ తీసుకోలేకపోతున్నారు.
రఘురామకృష్ణరాజుకు.. కేంద్రం మద్దతు ఉందో లేదో కానీ.. పీవీ సునీల్‌కుమార్‌కు మాత్రం ఏపీ ప్రభుత్వ పెద్దల మద్దతు మాత్రం పుష్కలంగా ఉంది. దీంతో ఆయనను భయపెట్టడానికే.. రఘురామ ఫిర్యాదులు చేస్తున్నారని…కానీ ప్రభుత్వ అండ ఉన్నంత వరకూ.. సునీల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేరని.. వైసీపీ వర్గాలు.. ప్రచారం చేస్తున్నాయి.