టీవీ9 యాంకర్లు రోడ్డున పడ్డారు. కేసులు పెట్టుకున్నారు. దీంతో టీవీ9 యజమాన్యం కూడా ఉలిక్కిపడింది. వారి గొడవ పూర్తిగా వ్యక్తిగతమని చానల్‌కు.. వారు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదని సోషల్ మీడియాలో ప్రకటించుకోవాల్సి వచ్చింది. టీవీ9 యాంకర్ల మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరాటం ఉంది. వర్గాలు ఉన్నాయి. అయితే.. ఆఫీస్ పాలిటిక్స్ అన్ని చోట్లా ఉంటాయి.. కానీ టీవీ9లో మాత్రం గీత దాటిపోయాయి. ఎంత వరకూ అంటే.. కేసులు పెట్టుకునే వరకూ వెళ్లాయి. టీవీ9లోనే పని చేసే ప్రముఖ యాంకర్ ఒకరు.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం సంచలనం అయింది.
యాంకర్లు పూర్ణిమ, సుమతి, సుందర్ ముగ్గురూ కలిసి తమను వేధిస్తున్నారని.. అగే ఆఫీసులోనే పని చేసే మరో యాంకర్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. తన ఫోన్లో ఉన్న వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సేకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు IPC 66, R/w 43, 84(B)ఐటి ఆక్ట్, R/w 511 కింద కేసు నమోదు చేశారు. పూర్ణిమ, సుమతి, సుందర్ ముగ్గరి పేర్లనూ ఫిర్యాదులో పేర్కొనడంతో వారందరిపైనా కేసులు పెట్టారు. కేసు పెట్టింది కూడా మహిళా యాంకరేనని తెలుస్తోంది. పూర్ణిమ, సుమతి కూడా ప్రముఖ యాంకర్లే.
ఏదో సందర్భంలో యువతి వద్ద ఫోన్‌ను వారు తీసుకున్నారు. తర్వాత ఇవ్వలేదని.. ఎన్ని సార్లు అడిగినా ఇవ్వకపోవడంతో పాటు బెదిరించారని ఫిర్యాదు దారు అయిన యువతి ఆరోపిస్తున్నారు. మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనాత్మకం అవుతోంది. ఈ వివాదాన్ని బయటకు రాకుండా చేసి.. సంస్థ పరువు కాపాడాల్సిన పై స్థాయి వ్యక్తులు కూడా చూసీ చూడకుండా ఉండటంతో ఇప్పుడు సంస్థ పరువు సోషల్ మీడియాలో పోయే పరిస్థితి ఏర్పడిందని యాజమాన్యం ఆందోళన చెందుతోంది. అదంతా వారి వ్యక్తిగతమని ప్రకటించినప్పటికీ… జరిగాల్సిన నష్టం జరిగిపోయింది.