థియేటర్లపై నాని చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఫంక్షనః్ కి నాని అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా థియేటర్లపై, టికెట్ రేట్లపై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. కరోనా సమయంలో అన్నింటికంటే ముందు థియేటర్లు మూసేశారని, అన్నిటికంటే చివర్నో థియేటర్లు ఓపెన్ చేశారని, నిజానికి బార్లు, రెస్టారెంట్ల కంటే థియేటర్లే సేఫ్ అని.. అయినా సరే, థియేటర్లని, సినిమాని చిన్న చూపు చూస్తున్నారన్నాడు. టికెట్ రేట్లపై కూడా మాట్లాడాడు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, టికెట్ రేట్లు మాత్రం తగ్గించమంటున్నారని, సినిమా సమస్య చాలా చిన్న సమస్యగా కనిపిస్తోందని, నిజానికి వేలాదిమంది కార్మికుల సమస్య ఇదని ఆవేదన వ్యక్తం చేశాడు. “నా టక్ జగదీష్ రిలీజ్ కి ఉంది. అయితే దాని గురించి నేను మాట్లాడుతున్నానేమో అనుకుంటారు. కానీ నేను ఓ హీరోగా మాట్లాడడం లేదు. ఓ ప్రేక్షకుడిగా మాట్లాడుతున్నా“ అన్నారు నాని.
నిజానికి నానిది చాలా విలువైన పాయింట్. బార్లు రెస్టారెంట్లలో లేని పరిమితులు, షరతులు… సినిమాకెందుకు అన్నది ముందు నుంచీ నలుగుతున్న ప్రశ్నే. పెద్ద హీరోలు, ఇండ్రస్ట్రీ పెద్లలు అనుకుంటున్నవాళ్లూ ఇలాంటి టాపిక్ గురించి మాట్లాడాల్సింది. వాళ్లెవరూ నోరు మెదపలేదు. నాని మాత్రమే దీని గురించి మాట్లాడాడు. స్పందించాడు. టికెట్ రేట్ల గురించీ, థియేటర్ల అవస్థల గురించి నోరు విప్పాడు. ఇప్పుడైనా సరే.. మిగిలిన వాళ్లు దీనిపై స్పందిస్తే బాగుంటుంది. ఏపీలో ఇప్పటికీ 50 శాతం ఆక్యుపెన్సీనే ఉంది. టికెట్ రేట్లపై ఏపీలో ఎలాంటి నిర్ణయామూ తీసుకోలేదు. ఇకనైనా హీరోలంతా దీనిపై పెదవి విప్పితే మార్పు ఉండొచ్చు.