ఒలింపిక్స్‌లో భారత్ తరపున పాల్గొంటున్న ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పతకాలు తీసుకు వచ్చేందుకు ఒక్కో అడుగు ముందుకు వస్తున్నారు. తాజాగా.. 23 ఏళ్ల యువ బాక్సర్ లవ్లీనా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. అస్సాంకు చెందిన లవ్లీనా ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నారు. ఒలింపిక్స్‌లో తొలిసారి పాల్గొంటున్నా.. ఎక్కడా ఆ బెరుకు కనిపించనీయకుండా ముందడుగు వేస్తోంది. తాజాగా క్వార్టర్స్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ నిన్-చిన్ను 4-1 స్కోరుతో ఓడించింది. సెమీస్‌కు చేరడంతో భారత్కుఓ పతకంఖరారైంది. అయితేఅది కాంస్యంమో.. రజతమో కాకుండా .. స్వర్ణం తేవాలని దేశం మొత్తం లవ్లీనాకు సపోర్ట్‌గా నిలుస్ోతంది.
మరో వైపు తెలుగు తేజం పీవీ సింధు కూడా సెమీఫైనల్‌కు చేరుకున్నారు. అక్కడా ఓ పతకం ఖరారైనట్లే. క్వార్టర్ ఫైనల్లో తన చిరకాల ప్రత్యర్థి యమగుచిపై… వరుస సెట్లలో గెలిచి సెమీస్‌లో అడుగు పెట్టింది. ఆద్యంతం పోరాటపటిమ చూపిన సింధు… విజయాన్ని అందుకున్నారు. మరో రెండు మ్యాచ్‌లలో గెలిస్తే స్వర్ణ పతకం ఖాయమవుతుంది. గత ఒలింపిక్స్ బ్రెజిల్‌లోని రియోలో జరిగాయి. అక్కడ కూడా.. దేశానికి పతకం అందించారు పీవీ సింధు. అప్పట్లో రజత పతకం అందుకున్నారు. ఈ సారి స్వర్ణం సాధించాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఆమె ఈ దిశగా కఠోర శ్రమ చేసి.. అనుకున్న ఫలితాలను సాధిస్తున్నారు.
ఇతర క్రీడాంశాల్లో కొన్ని ఎదురు దెబ్బలు తలుగుతున్నప్పటికీ.. భారత క్రీడాకారులు పోరాటపటిమ ప్రదర్శిస్తున్నార. పై స్థాయి వరకూ కష్టపడుతున్నారు. కొంత మందికి అదృష్టం కలసి రావడం లేదు. అయితే ఈసారి.. సుదీర్ఘ కాలంగా.. ఇండియాకు కలగా ఉన్న స్వర్ణాన్ని… ఆటగాళ్లు తీసుకు వస్తారని అంచనా వేస్తున్నారు. షూటింగ్లో అభినవ్ భింద్రా .. స్వర్ణం సాధించిన తర్వాతమరోసారి ఎవరూ స్వర్ణం వరకూ రాలేకపోయారు. ఈ సారి ఆ నిరీక్షణ ఫలించే అవకాశం ఉంది.