సునీల్ స్పీడు పెంచాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా.. ఫుల్ బిజీ. తను హీరోగా నటించిన `కనపడుటలేదు` విడుదలకు సిద్ధమైంది. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు తన ఖాతాలో మరో సినిమా చేరింది. అదే.. `బుజ్జీ.. ఇలా రా`. ధన్‌రాజ్ మరో హీరో. `గరుడ వేగ`అంజి దర్శకుడు. ఈచిత్రానికి మరో దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఆయన నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. చాందిని హీరోయిన్. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్ అని, సునీల్ పాత్ర చిత్రవిచిత్రంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.